CBSE: 6, 9, 11 తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్’
Sakshi Education
ఆరు, తొమ్మిది, పదకొండు తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్’ను వర్తింపజేస్తూ.. సీబీఎస్‌ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. 2024–25 విద్యా సంవత్సరానికిగాను ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో పాల్గొనేందుకు తమ అనుబంధ స్కూల్స్‌ను ఆహ్వానిస్తున్నామని సీబీఎస్‌ఈ అధికారులు ఏప్రిల్ 10న వెల్లడించారు. క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ అమలుకు సంబంధించి మార్గదర్శకాలను సీబీఎస్‌ఈ సిద్ధం చేసింది. కేంద్రం గతేడాది ‘జాతీయ క్రెడిట్æఫ్రేమ్‌వర్క్’ను ఆవిష్కరించింది. దీని ప్రకారం–ప్రీ ప్రైమరీ నుంచి పీహెచ్‌డీ వరకు విద్యార్థులకు క్రెడిట్స్ జారీచేస్తారు.
చదవండి: April 18th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 19 Apr 2024 06:17PM