Navodaya Admission: నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో 2024–25 విద్యా సంవత్సరంలో 9, 11 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నవోదయ విద్యాలయ సమితి ప్రిన్సిపాల్ సుభమహేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సైన్స్ మాథ్స్, గణితం లేకుండా సైన్స్, కోర్సుల్లో ప్రవేశానికి ఒంగోలు, చీరాల, కందుకూరు, అద్దంకి, వేటపాలెం, గుడ్లూరు, వలేటివారిపాలెం, పొన్నలూరు, లింగసముద్రం, సింగరాయకొండ, ఉలవపాడు, టంగుటూరు, జరుగుమల్లి, కొండపి, చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, సంతమాగులూరు, కొరిశపాడు, జె.పంగులూరు, మార్టూరు, యద్దనపూడి, బల్లికురవ, పర్చూరు, ఇంకొల్లు, కారంచేడు, చినగంజాం మండలాల నుంచి ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయునిచే ధృవపరిచిన అనంతరం ఆన్‌లైన్‌లో అక్టోబరు 31వ తేదీలోగా అప్‌లోడ్ చేయాలన్నారు. అనంతరం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 2024 ఫిబ్రవరి 10వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.