Spot Admissions for Degree Colleges: ఈ నెల 16 నుంచి స్పాట్ అడ్మిషన్స్
సాక్షి ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నమాణిక్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
IT Organizations in AP: విశాఖకు మరిన్ని ఐటీ సంస్థలు..
తమ కళాశాలలో బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్, బీఏ ఆనర్స్ ఎకనామిక్స్, బీకాం ఆనర్స్ జనరల్ (మైనర్ కంప్యూటర్ అప్లికేషనన్స్), బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్‌న్స్, బీఎస్సీ ఆనర్స్ జంతు శాస్త్రం, బీఎస్సీ ఆనర్స్ రసాయన శాస్త్రం కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన అందిస్తామని ఆయన తెలిపారు. డిగ్రీ కోర్సుల విద్యా బోధనతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన శిక్షణ అందిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.