Admissions: నేటితో ముగియనున్న నవోదయ ప్రవేశాల గడువు
Sakshi Education
యడ్లపాడు: జవహర్ నవోదయ విద్యాలయంలో 2024–25 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి నవంబర్ 7 మంగళవారంతో గడువు ముగుస్తుందని పల్నాడు జిల్లా మద్దిరాల జేఎన్‌వీ ప్రిన్సిపాల్ ఎన్.నరసింహరావు తెలిపారు. ప్రస్తుతం 8వ తరగతి చదివే విద్యార్థులు 2009 మే 1 నుంచి 2011 జులై 31 మధ్య, అలాగే 10వ తరగతి వారు 2007 జూన్ 1 నుంచి 2009 జులై 31 మధ్య జన్మించిన వారై ఉండాలన్నారు. సాయంత్రం 5గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలన్నారు.
చదవండి: Navodaya Vidyalaya Samiti: 9వ తరగతిలో లేటరల్ ఎంట్రీకి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
Published date : 07 Nov 2023 02:39PM