Navodaya Vidyalaya Samiti: 9వ తరగతిలో లేటరల్ ఎంట్రీకి దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
![Jawahar Navodaya Vidyalayas Class IX Vacancies Advertisement, Opportunity for Class IX Admission, admission in jawahar navodaya vidyalaya, "Free Education Opportunity ,](/sites/default/files/2023-10/jnv.jpg)
ఇందుకోసం లేటరల్ ఎంట్రీ పరీక్షను నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు లేటరల్ ఎంట్రీ పరీక్ష రాసి.. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా తమ చదువులను కొనసాగించవచ్చు. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించడంలో నవోదయ స్కూల్స్‌కు మంచి పేరుంది. వీటిని కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యాసమతి నిర్వహిస్తోంది. ఈ పాఠశాలల నిర్వహణకు అవసరమైన నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతోపాటు దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు బోధనతోపాటు భోజన వసతి, బుక్స్, యూనిఫామ్.. ఇలా అన్నీ ఉచితంగా అందిస్తారు. అధిక వేతనం కలిగిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఇందు కోసం ప్రతి నెల రూ.1500 చొప్పున ఫీజు చెల్లించాలి. మిగిలినవారు నెలకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
అర్హతలు
తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు ప్రస్తుతం 2023-24 విద్యా సంవత్సరంలో.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతుండాలి. ప్రవేశం ఆశించే నవోదయ పాఠశాల పరిధిలోని జిల్లాకు చెందినవారై ఉండాలి. ఆయా జిల్లాల్లో ఉన్న పాఠశాలల్లోని ఖాళీలకు సంబంధిత జిల్లాల విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. పరీక్షలను కూడా సంబంధిత జిల్లా కేంద్రాల్లోనే నిర్వహిస్తారు.
వయసు: మే 1, 2009 - జూలై 31, 2011 మధ్య జన్మించి ఉండాలి.
చదవండి: Admission in Navodaya Vidyalaya: 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఎంపిక విధానం
లేటర్ ఎంట్రీ విధానంలో తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్-15, హిందీ-15, మ్యాథ్స్-35, సైన్స్‌లో 35 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ కూడా సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి స్థాయి సిలబస్ నుంచే ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
వ్యక్తిత్వ వికాసం
నవోదయ పాఠశాలల్లో చేరిన బాలబాలికలను చదువులకే పరిమితం చేయకుండా.. పరిసరాలపై అవగాహన కల్పిస్తారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధితోపాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా అధిక ప్రాధాన్యమిస్తారు. అలాగే ప్రతి విద్యార్థి మూడు భాషల్లో ప్రావీణ్యం పొందేలా కృషి చేస్తారు.
ఇంటర్ నుంచే ఐఐటీ-జేఈఈ
నవోదయ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఐఐటీ -జేఈఈ, నీట్, క్లాట్, ఎన్‌డీఏ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణను అందిస్తారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2023
- పరీక్ష తేదీ: ఫిబ్రవరి 10, 2023
- వెబ్‌సైట్: https://navodaya.gov.in