Sainik Schools: రక్షణ రంగంలో ఉన్నత స్థాయికి , ఉత్తమ మార్గం!.. దరఖాస్తు చివరి తేది ఇదే..
దేశ వ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 33 సైనిక్ స్కూళ్లలో (S.S) అలాగే కొత్తగా 35 స్కూళ్లలో (N.S.S) ఆరోతరగతి ప్రవేశాలు మాత్రమే ఉంటాయి. వీటికి సైనిక్ స్కూల్స్ నిభంధనలు వర్తిస్తాయి.
కొత్త సైనిక్ స్కూల్స్ లో 40% సీట్లను మెరిట్ లిస్ట్ ప్రకారం భర్తీ చేస్తారు.
ప్రవేశ పరీక్ష :
ఆరోతరగతి : 21 జనవరి 2024 రోజున 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు . 125 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలు 5 వ తరగతి CBSE syllabus నుండి వస్తాయి .Maths - 50 ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు 3 మార్కులు .లాంగ్వేజ్ - 25 ప్రశ్నలు ( English , Hindi , Telugu మరియు ప్రాంతీయ భాష ఏదైన ఎంచుకోవచ్చు ) . G.K ( includes social , science) - 25 ప్రశ్నలు.
IT - 25 ప్రశ్నలు చొప్పున ఉంటాయి . ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి .
పరీక్ష వ్యవధి: 2 hr 30 min
తొమ్మిదో తరగతి: 400 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి . 8 వ తరగతి CBSC Syllabus నుండి వస్తాయి . Maths - 50 ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు 4 మార్కులు . English , General science , social మరియు I.T నుండి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి . ప్రశ్నాపత్రం ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.
పరీక్ష వ్యవధి: 3 గంటలు
- ఆరు , తొమ్మిది తరగతుల ప్రవేశ పరక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి.
- సమాధానాలను OMR పత్రంపై గుర్తించాలి.Negative మార్కులు ఉండవు.
- పరీక్షలో అర్హత సాధించాలంటే 25% తప్పనిసరి . మొత్తం మార్కులలో 40% మార్కులు పొందితేనే అర్హత సాధిస్తారు.
- S.C , S.T విద్యార్థినీ , విద్యార్థులకు కనీస మార్కుల నిబంధన ఉండదు.
- అర్హత సాధించిన జాబితా నుండి మెరిట్ , రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెడికల్ టెస్టులకి పిలుస్తారు.
సీట్లు: తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ( A.P , T.S ) కోరుకొండ , కలికిరి సైనిక్ స్కూల్స్ లలో 67% సీట్లకు పోటీ పడతారు . మిగతా సీట్లు ( 33% ) ఇతర రాష్ట్రాల విద్యార్థులకి కేటాయిస్తారు.
చదవండి: Admissions in Sainik School: బాలికల సైనిక్ స్కూల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
ఆరో తరగతి ప్రవేశ సీట్లు: కోరుకొండ సైనిక్ స్కూల్స్ 78 సీట్లు కలికిరి సైనిక్ స్కూల్స్ లో 105 సీట్లు . అదాని వరల్డ్ స్కూల్ ( N.S.S ) లో 80 సీట్లు కేటాయించారు. ( Nellore)
తొమ్మిదో తరగతి ప్రవేశ సీట్లు: కోరుకొండ - 22 సీట్లు , కలికిరి - 10 సీట్లు
ఫీజు: భోధన, వసతి , భోజనం , యూనిఫాం, పుస్తకాలు అన్ని కలిపి సుమారు 1.75 లక్షల వరకు ఉంటాయి . 33 సైనిక్ స్కూల్స్ లలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యాలలో నడుస్తాయి కావున ఫీజు ఒకేలా ఉండదు .
అర్హత:
ఆరోతరగతి ప్రవేశానికి : ఏదైన గుర్తింపు పొందిన ( ప్రభుత్వ/ ప్రైవేట్ ) పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వారు . 1st April 2012 -31 మార్చి 2014 మద్య జన్మించి ఉండాలి.
తొమ్మిదో తరగతి ప్రవేశానికి: ఏదైన గుర్తింపు పొందిన ( ప్రభుత్వ/ ప్రైవేట్ ) పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వారు . 1st April 2009 31st March 2011 మద్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు చివరి తేది: 16 డిసెంబర్ , సాయంత్రం 5 గం. వరకు
పరిక్ష ఫీజు: జనరల్ డిపెస్స్ వారికి 650/RS S.C.S.T లకు 500 RS
పరిక్ష తేదీ: January 21 2024
కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, నెల్లూరు అనంతపురం కడప, గుంటూరు, కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం.
ఉపయోగాలు:
- ఎంపికైన విద్యార్ధులకు ఆరో తరగతి నుండి ఇంటర్మిడియట్ వరకు చదువుతారు.
- చదువుతో పాటు క్రీడలు , కమశిక్షణ, శారీరక దృడత్వంతో పాటు, విశాలమైన మైదానాలు, పౌష్ఠిక ఆహారం, (పశాంత వాతావరణం. పిల్లల మానసిక ఆరోగ్యాన్నిస్తూ, ఉన్నత స్థాయిని సమాజంలో ఇస్తుంది.
- ఉద్యోగ నియామకాలు ప్రతియేటా ఎక్కువగా రక్ష కారకారంగలలో ఉంటాయి.
- U.P.S.C నిర్వహించే N.A లాంటి ముఖ్యమైన ఉద్యోగాలు ఎక్కువగా సైనిక్ స్కూల్స్ విద్యార్థులు ఎంపికవుతుంటారు. వారు ఉన్నత అదికారులుగా ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి.
- ప్రతి ఆరు నెలలకు ఉద్యోగ నోటిఫికేషన్స్ వెలువడుతాయి.