IIHT Diploma Courses: ఐఐహెచ్‌ఎలో డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు..
![Textile officer Nagaraja Rao announcement Fill vacant seats in diploma courses Spot admissions at Sripragada Kotaiah Memorial IIHA Spot admissions for diploma courses in Indian Institute of Handloom Technology](/sites/default/files/images/2024/08/03/iiht-diploma-courses-1722661076.jpg)
కడప: వెంకటగిరిలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌ఎ)లో డిప్లొమా కోర్సులలో ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా చేనేత జౌళి శాఖాధికారి నాగరాజ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Recognized Colleges: విద్యార్థులను గుర్తింపు లేని కళాశాలల్లో చేర్పించవద్దు..
పీకేఎం ఐఐ హెచ్‌టీ ఓఎస్‌ఓ ఎస్.గిరిధర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు కళాశాలలో రెండు, మూడు సంవత్సరాల లెటరల్ ఎంట్రీ (డీహెచ్ టిడీ)కు ఈనెల 20న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 10వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఐటీఐలో పాసైన విద్యార్థులకు నేరుగా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తారన్నారు. వయసు 15–23 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. వివరాలకు 9441795408, 9866169908, 9010243054 నెంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు.
Tags
- admissions
- Diploma Courses
- Indian Institute of handloom technology
- Applications
- District Head Textile Officer Nagaraju
- Spot Admissions
- June 20
- Tenth Students
- Intermediate
- Eligible Candidates
- IIHT Diploma Courses
- Education News
- Kadapa District News
- IIHA
- IIHT
- venkatagiri
- Diploma Courses
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024