Skip to main content

Polytechnic Admissions: ఈనెల 3వ తేదీన పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిష‌న్స్

ఇటీవ‌లె విడుద‌లైన ప్ర‌క‌ట‌నాధారంగా ఈ నెల మూడో తేదీన అడ్మిష‌న్లను నిర్వ‌హిస్తున్నట్లు తెలిపారు. అర్హ‌త ఆస‌క్తి గ‌ల‌వారు ప్ర‌క‌టించిన తేదీ లోగా అడ్మిష‌న్ల‌ను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ అడ్మిష‌న్ల విధి విధానాన్ని స్ప‌ష్టంగా వివ‌రించారు.
Spot admissions at polytechnic colleges
Spot admissions at polytechnic colleges

సాక్షి ఎడ్యుకేష‌న్: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరంలో ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏపీ పాలిసెట్‌–2023 కన్వీనర్‌ పేరిట ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రభుత్వ/ఎయిడెడ్‌/ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల మూడో తేదీన స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 5న స్పాట్‌ అడ్మిషన్ల వివరాలు వెబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 6న ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.

District Level Selections: పార్వ‌తీపురంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

ఆయా కళాశాలలు స్పాట్‌ అడ్మిషన్ల జాబితాలను 9వ తేదీలోగా కన్వీనర్‌, పాలిసెట్‌–2023 అడ్మిషన్ల పేరిట ఇన్‌ పర్సన్‌ అందజేయాలి. జిల్లా వ్యాప్తంగా వివిధ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సుమారు వివిధ కోర్సుల్లో 2 వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. పాలిసెట్‌ రాయని వారు, రాసిన వారు, అర్హత ఉండి, ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే పాలిసెట్‌ అడ్మిషన్లు పొందాలని పాలిసెట్‌ జిల్లా కన్వీనర్‌ డాక్టర్‌ ఎస్‌.రామారావు తెలిపారు. ఇతర వివరాలకు 94401 24846 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.
 

Published date : 02 Oct 2023 11:33AM

Photo Stories