Skip to main content

District Level Selections: పార్వ‌తీపురంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశంలో భాగంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసారు డీఎస్‌డీఓ. ఈ పోటీల‌కు సంబంధించి పూర్తి వివ‌రాల‌ను ప‌రిశీలించండి..
DSDO Venkateshwar rao
DSDO Venkateshwar rao

సాక్షి ఎడ్యుకేష‌న్: డాక్టర్‌ వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలో గల రాష్ట్ర క్రీడా అకాడమీలో ప్రవేశాలకు వచ్చేనెల 5వ తేదీన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీఓ ఎస్‌. వెంకటేశ్వరరావు తెలిపారు.

Courses for Students: భ‌విష్య‌త్ లో విద్యార్థుల జీవితానికి, ఉద్యోగానికి వివిధ కోర్సుల భ‌రోసా

ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, హాకీ, టెన్నిస్‌, వాలీబాల్‌ క్రీడలకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎంపిక పోటీల్లో 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గలవారు పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. 5వ తేదీ ఉదయం 9గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 9052248464 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

Published date : 30 Sep 2023 02:35PM

Photo Stories