Quiz Competitions : డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ క్విజ్ పోటీలు..
పార్వతీపురం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన 90వ వార్షికోత్సవం సందర్శనలో డిగ్రీ విద్యార్థులకు ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ ప్రసాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఈ క్విజ్ పోటీ పోస్టర్‌ను ప్రారంభించారు.
ఏ కాలేజీ విద్యార్థులైనా https://www.rbi90quiz.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు. కనీసం ఇద్దరు విద్యార్థులతో కూడిన జట్లు కూడా నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిలలో ఈ పోటీ నిర్వహించబడుతుంది.
Solar Power Plant: తెలంగాణ పొలాల్లో సోలార్ ప్లాంట్లు.. పీఎం–కుసుం పథకం కింద కేంద్రం గ్రీన్‌సిగ్నల్
బహుమతులు:
రాష్ట్ర స్థాయి:
ప్రథమ బహుమతి: రూ. 2 లక్షలు
ద్వితీయ బహుమతి: రూ. 1.5 లక్షలు
తృతీయ బహుమతి: రూ. 1 లక్ష
జోనల్ స్థాయి:
ప్రథమ బహుమతి: రూ. 5 లక్షలు
ద్వితీయ బహుమతి: రూ. 4 లక్షలు
తృతీయ బహుమతి: రూ. 3 లక్షలు
జాతీయ స్థాయి:
ప్రథమ బహుమతి: రూ. 10 లక్షలు
ద్వితీయ బహుమతి: రూ. 8 లక్షలు
తృతీయ బహుమతి: రూ. 6 లక్షలు
నమోదు గడువు: సెప్టెంబర్ 17
జిల్లా ప్రధాన బ్యాంక్ మేనేజర్ జీ.ఎల్.ఎన్. మూర్తి, విద్యార్థులు సెప్టెంబర్ 17వ తేదీలోపు క్విజ్ పోటీకి నమోదు చేసుకోవాలని కోరారు. నమోదుకు రుసుము లేదు.