Show Cause Notice: కళాశాలకు షోకాజ్ నోటీసులు.. కారణం?
సాక్షి ఎడ్యుకేషన్: ఎండాడలో కాలేజీ నిర్వహణ కోసమని అనుమతులు తీసుకున్న ఎన్‌ఆర్‌ఐ యాజమాన్యం, అక్కడ కాకుండా బోయపాలెంకు దర్జాగా తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ కాలేజీ నడిపిస్తున్నారు. తనిఖీలకు వెళ్లిన ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఈ తతంగాన్ని చూసి అవాక్కయ్యారు. ఒక చోట అనుమతులు తీసుకొని, మరో చోట కాలేజీ నిర్వహించటంపై తీవ్రంగా పరిగణిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కాలేజీ యాజమాన్యానికి రూ.2.50 లక్షలు జరిమానా విధించారు.
New Scheme for UPSC Candidates: ఏపీ ప్రభుత్వం అమలు చేసిన కొత్త పథకం
● ఇంటర్మీడియెట్ బోర్డు వద్ద ఉన్న అనుమతుల మేరకు నవోదయ జూనియర్ కాలేజీ పెందుర్తిలో నిర్వహించాలి. కానీ కాలేజీ మరో చోటకు షిఫ్ట్ చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు, సదరు యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి, రూ.2.50 లక్షలు జరిమానా విధించారు. తదుపరి చర్యలకు రెండోసారి కూడా నోటీసులు జారీ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు ప్రైవేటు యాజమాన్యాల విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేసేలా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఏడు జూనియర్ కాలేజీలను గుర్తించి, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా ఒక్కో కాలేజీ యాజమాన్యానికి రూ. 2.50 లక్షలు చొప్పున జరిమానా విధించారు. తనిఖీల ప్రక్రియ ఇంకా కొనసాగుతుం డటంతో, ఇలాంటి కాలేజీలు ఇంకెన్ని బయటపడతాయోనని విద్యాశాఖ వర్గాలు, కాలేజీ యాజమాన్యాల్లో సర్వత్రా చర్చసాగుతోంది.
Constable Certificates Verification: రెండు రోజులపాటు కానిస్టేబుల్ సర్టిఫికెట్ పరిశీలన
అకాడమీల పేరుతో ఫీజుల దోపిడీ
ఉమ్మడి విశాఖ జిల్లాలో 360 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 21 కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టడం లేదు. మిగతా కాలేజీలో ఏటా ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం కలిపి 1.10 లక్షల మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో 246 కాలేజీలు ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోనే ఉన్నాయి. రెసిడెన్షియల్ కాలేజీలు నిర్వహిస్తుండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సైతం విద్యార్థులు విశాఖ నగరంలోని కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. విద్యార్థుల డిమాండ్‌తో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. వివిధ ఎంట్రన్స్ పరీక్షల శిక్షణ పేరుతో ఎటువంటి అనుమతుల్లేకుండానే అకాడమి, కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, లక్షలాది రూపాయలను ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాటిపై ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు దృష్టి సారించి, తనిఖీలు ముమ్మరం చేశారు.
Telangana Govt Jobs: తెలంగాణ వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆ విద్యార్థులకు అడ్మిషన్లు ఎక్కడ
గురుద్వారా వద్ద నీట్, ఐఐటీ, జేఈఈ, క్లాట్, సీఏ పేరుతో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్‌లో 2 వందల మందికి పైగానే విద్యార్థులు ఉన్నారు. వీరిని నగరంలోని వేర్వేరు కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చి, ఇక్కడనే రోజంతా తరగతులు నిర్వహిస్తుండటం గమనార్హం. రెగ్యులర్‌గా కాలేజీలకు వెళ్లి, 75 శాతం మేర హాజరు ఉన్న వారికే అమ్మ ఒడి పథకానికి అర్హులు. అలాంటప్పుడు, కోచింగ్ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు అడ్మిషన్లు ఎక్కడ ఇస్తున్నారనేది అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది. అదే విధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే కాలేజీల ప్రాంగణాల్లోనే వసతి గృహాలు నిర్వహిస్తున్నారు.
Admission in YSRUHS: డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీలో బీఎన్‌వైఎస్ ప్రవేశాలు
కఠినంగానే వ్యవహరిస్తాం
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే ప్రైవేటు కాలేజీలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడు కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. బోర్డు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అకాడమీలపై కూడా దృష్టి సారించాం. అనుమతులు లేని వాటిని మూసివేస్తాం.
–రాయల సత్యనారాయణ, ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి, విశాఖపట్నం