Skip to main content

National Scholarship: నేష‌నల్ స్కాలర్‌షిప్ విద్యార్థులకు న‌మోదు చివ‌రి తేది ఇదే..

విద్యార్థుల‌కు నిర్వ‌హించిన స్కాలర్‌షిప్ ప‌రీక్ష‌లో ఎంప‌కైన విద్యార్థుల‌కు న‌మోదు చేసుకునేందుకు వివ‌రాల‌ను, తేదీను వెల్ల‌డించారు.. వివ‌రాలు..
Students selected for National Scholarship
Students selected for National Scholarship

సాక్షి ఎడ్యుకేష‌న్: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నేషనల్‌ స్కాలర్‌షిప్‌ ఎన్‌ఎంఎన్‌ఎస్‌ 2023 సంవత్సరానికి ఎంపికైన విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని డీఈఓ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర విద్య, మంత్రిత్వ శాఖ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో తమ వివరాలను తప్పులు లేకుండా మెరిట్‌ కార్డుపై ముద్రించిన విధంగా ఆధార్‌, బ్యాంక్‌ పాస్‌ బుక్కుల్లో ఉండే విధంగా పోర్టల్‌లో నవంబర్ 30 లోగా నమోదు చేయాలని ఆయన సూచించారు.

➤   Andhra Pradesh: ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ బోధన

సంబంధిత పాఠశాలల మోడల్‌ అధికారి డిసెంబర్‌ 15వ తేదీలోగా క్షుణ్ణంగా పరిశీలించి వివరాల నమోదు తీరును చూడాలని తెలిపారు. నమోదు చేసిన అప్లికేషన్‌ను ప్రింట్‌ తీసి దాంతో పాటు స్టడీ సర్టిఫికెట్‌, కుల ధృవీకరణ పత్రం, బ్యాంకు, ఎకౌంట్‌ పాస్‌బుక్‌ మొదటి పేజీ జతపరచి డీఈఓ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. జిల్లా మోడల్‌ అధికారి లాగిన్‌ ద్వారా వెరిఫై చేయించుకున్న అప్లికేషన్లకు మాత్రమే స్కాలర్‌షిప్‌ మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గత సంవత్సరాలలో ఈ పరీక్షకు ఎంపికై ప్రస్తుతం 10, 11, 12 తరగతులు చదువుతూ అర్హత కలిగిన ప్రతీ విద్యార్థి ఈ సంవత్సరం రెన్యూవల్‌ చేసుకోవాలని సూచించారు.

Published date : 30 Oct 2023 04:23PM

Photo Stories