Skip to main content

Andhra Pradesh: ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ బోధన

‘ప్రతి పిల్లోడు గొప్పగొప్ప చదువులు చదవాలి. ప్రతి ఇంటి నుంచి పెద్దపెద్ద ఇంజినీర్లు, డాక్టర్లు రావాలి.
Andhra Pradesh
ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ బోధన

 మనం పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు ఒక్కటే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీ మేనమామగా నేను చదివిస్తాను.. మీరు చదవండి’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు సమూలంగా మార్చేశారు.

పనులు పూర్తయిన పాఠశాలల్లో డిజిటల్‌ విద్యకు కావాల్సిన సరంజామాను సమకూర్చారు. పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలో అమలవుతున్న డిజిటల్‌ బోధన విధానంపై స్పెషల్‌ ఫోకస్‌..

తిరుపతి ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచే స్మార్ట్‌ క్లాస్‌ రూములు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌(ఐఎఫ్‌ిపీ), స్మార్ట్‌ టీవీలను ప్రభుత్వం సరఫరా చేసింది.

చదవండి: District Level School Sports: పాఠశాలల క్రీడా జట్ల ఎంపిక

‘నాడు’ బ్లాక్‌ బోర్డులపైన సాగిన బోధన ‘నేడు’ ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌(ఐఎఫ్‌ిపీ), స్మార్ట్‌ టీవీల్లో సాగుతోంది. దీనికోసం ఆయా పాఠశాలలకు 4జీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యం మెరుగయ్యింది.

ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీల పంపిణీ

తిరుపతి జిల్లా వ్యాప్తంగా 330 ప్రభుత్వ యాజమాన్య ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో నాడు–నేడు పూర్తయిన 179 పాఠశాలలకు 1,110 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌(ఐఎఫ్‌పీ)ను అందజేశారు. మిగిలిన 151 పాఠశాలలకు డిసెంబర్‌లోగా ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ను అందించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,120 ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి నాడు–నేడు పూర్తయిన 236 పాఠశాలలకు 350 స్మార్ట్‌ టీవీలను అందజేశారు. నాడు–నేడు పూర్తవ్వగానే మిగిలిన పాఠశాలలకు స్మార్ట్‌ టీవీలను అందజేయనున్నారు.

నైపుణ్యం మెరుగు
దృశ్య, శ్రవణ రూపంలో జరిగే విద్యాబోధనతో విద్యార్థులు చాలా సులువుగా పాఠ్యాంశాలను నేర్చుకుంటారు. సబ్జెక్టుపై పట్టు సాధిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్న సత్సంకల్పంతో ఐఎఫ్‌పీ, స్మార్ట్‌ టీవీలను ప్రభుత్వం అందిస్తోంది. వీటి ద్వారా విద్యార్థులు చాలా ఆసక్తితో పాఠాలను నేర్చుకుంటున్నారు.

– డాక్టర్‌ వీ.శేఖర్‌, జిల్లా విద్యాశాఖాధికారి, తిరుపతి

అన్ని పాఠశాలలకు అందిస్తాం
తిరుపతి జిల్లాలో నాడు–నేడు పనులు పూర్తయిన ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఐఎఫ్‌పీ ప్యాన ల్స్‌, ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్‌ టీవీలను అందించాం. 4జీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాం. ఇప్పటికే వీటి ద్వారా విద్యాబోధన జరుగుతున్న పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యం, పాఠ్యాంశాలపై పట్టు చాలా మెరుగయ్యింది. – జీ.సురేష్‌, బైజూస్‌ జిల్లా నోడల్‌ అధికారి, తిరుపతి

Published date : 30 Oct 2023 04:09PM

Photo Stories