Skip to main content

District Level School Sports: పాఠశాలల క్రీడా జట్ల ఎంపిక

ఖమ్మంస్పోర్ట్స్‌: ఉమ్మడి జిల్లాస్థాయి పాఠశాలల క్రీడల జట్ల ఎంపికలను ఆదివారం నగరంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం, సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌లో చేపట్టారు.
Selection of school sports teams
పాఠశాలల క్రీడా జట్ల ఎంపిక

అండర్‌ – 17, 14 నెట్‌బాల్‌, జూడో, ఉషూ బాలబాలికల ఎంపికలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి 90 మంది క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొన్నారు. ఈ ఎంపికల ప్రక్రియను పీఈటీలు పీవీ రమణ, ఎండీ షఫీక్‌ అహ్మద్‌, కృష్ణమూర్తి, శ్రీనివాస్‌, నెట్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఫణి పరిశీలించారు. నెట్‌బాల్‌ రాష్ట్రస్థాయి పోటీలు ఖమ్మంలో, జూడో పోటీలు వరంగల్‌లో, ఉషూ పోటీలు మహబూబాబాద్‌లో జరుగుతాయని తెలిపారు. ఉమ్మడి జిల్లా నెట్‌బాల్‌ అండర్‌ – 17 జట్టుకు ఎంపికై న వారి వివరాలను జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి కె.నర్సింహారావు ప్రకటించారు. అండర్‌ – 17 నెట్‌బాల్‌ బాలుర జట్టుకు జి.వసంత్‌, ఎన్‌. మణికంఠ, ఎండీ అబిద్‌, ఎన్‌.జయదీప్‌, టి.సిద్ధు, బి. సిద్ధార్థ, కె.స్నేహిత్‌, వెంకట్‌. డి.ఈశ్వర్‌, జె.రంజిత్‌, పి.మోహన్‌కృష్ణ, జి.నాగకౌషిక్‌ ఎంపికయ్యారు. బాలికల జట్టుకు జి.హారిక, ఎ.మహేశ్వరి, కె.రుచిరసాయి. జె.మమత, వి.సాయిచరిత, జి.మౌనిక, డి.దీక్షిత, ఎన్‌.లక్ష్మిప్రసన్న, ఆర్‌.హాసిక, సీహెచ్‌ అమృత, డి.షణ్ముకహారిని, జూడో బాలికల జట్టుకు జి.హర్షవర్దన్‌, ఎం.ప్రణవ్‌కుమార్‌, ఎన్‌.మనోహర్‌, సీహెచ్‌ పార్థివ్‌, డి.దేవ్లానాయక్‌, బి.చరణ్‌తేజ, బి.గణేశ్‌, బాలికల జట్టులో సీహెచ్‌.కరీష్మా, సీహెచ్‌. హిమవర్ధిని, బి.స్పందన, ఎస్‌డీ సన, పి.జాహ్నవి, జి.లిఖిత, ఉషూ జట్టులో డి.నరేశ్‌, కె.దేవమణికంఠ, జి.సాత్విక్‌నాయుడు, వై.సుశాంత్‌, టి.అఖిలేశ్‌, బాలికల జట్టులో సాయిమౌనిక, హారిక, ఈశ్వరీ తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

Vritti clinches Bronze in National Games: జాతీయ క్రీడల్లో వ్రితి అగర్వాల్‌కు కాంస్యం

International Wrestling Championship: రెజ్ల‌ర్ చాంపియన్‌షిప్ కు యువ‌తి ఎంపిక‌..

Published date : 30 Oct 2023 03:03PM

Photo Stories