KU degree colleges: 64,021 ఖాళీలు.. స్పెషల్ ఫేజ్‌కు అడ్మిషన్ల ప్రక్రియ షురూ..
ఈ విద్యా సంవత్సరంలో 2023–2024లో ఆయా డిగ్రీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గాను ఇప్పటి వరకు మూడు దశల్లో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా సీట్లు కేటాయింపులు జరిగాయి. యూనివర్సిటీ పరిధిలో ఉన్న సీట్లల్లో సగం కూడా భర్తీకాలేదు. కేవలం 35శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అటానమస్ డిగ్రీ కళాశాలలు కలిపి 267 ఉన్నాయి. అందులో వివిధ డిగ్రీ కోర్సులన్నీ కలిపి మొత్తం 98,980 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది మే నుంచి జూలై వరకు మూడు దశల్లో అడ్మిషన్ల ప్రక్రియ జరిగింది.
Also read: Indian Airforce Recruitment 2023 : అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే !
మొదటి దశలో కేయూ పరిధిలోని కళాశాలలకు 16,078 సీట్లు కేటాయించగా అందులో 10,678 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఆ తరువాత జరిగిన రెండోదశలో 11,112 సీట్లు కేటాయించగా 8,342 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఆ తరువాత మూడోదశలో 18,076 సీట్లు కేటాయించగా 15,939 మంది విద్యార్థులు కళాశాలల్లో చేరారు. మూడు దశల్లో నిర్వహించిన డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో మొత్తం 45,266 సీట్లు కేటాయించగా 34,959 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. కేవలం 35శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 64,021 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Also read: Velugu Abhyasamithra: విద్యార్థుల్లోని సామర్థ్యాలు వెలికితీయాలి: నోడల్ అధికారి వెంకటయ్య
స్పెషల్ ఫేజ్‌కు అడ్మిషన్ల ప్రక్రియ షురూ..
రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను మూడు దశలు ముగిసినా వివిధ యూనివర్సిటీల పరిధిలో సీట్లు చాలా మిగిలాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి దోస్త్ ద్వారా స్పెషల్ ఫేజ్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియకు షెడ్యూల్ జారీ చేసింది. ఈ నెల 7వతేదీ నుంచి స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ షురూ అయింది. ఈ నెల 13వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం నుంచి ఈనెల 14వ తేదీవరకు వెబ్ ఆష్షన్‌లు ఇచ్చుకోవాలి. ఈనెల 17న సీట్లు కేటా యింపు జరగనుంది.
Also read: AP EAPSET ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు
స్పెషల్ ఫేజ్ నిర్వహించినా కూడా సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ అయ్యే పరిస్థితి కనపడడంలేదు. ఇంటర్ పూర్తికాగానే ఎక్కువశాతం మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులతోపాటు దూర ప్రాంతాల రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. దీంతో సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ఆదరణ తగ్గిపోతుంది. డిగ్రీలో కూడా పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టినప్పటికీ వాటికి కూడా ఆదరణ అంతగా ఉండడం లేదనే సీట్ల భర్తీని బట్టి తెలుస్తోంది.
Also read: Awareness of laws: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
మరోవైపు డిగ్రీలోనూ గురుకులాల సంఖ్య పెంపుదల చేశారు. దీంతో గురుకులాల్లో చేరడంతో ఆ ప్రభావం కూడా ఇతర కళాశాలపై పడిందని భావిస్తున్నారు. మరోవైపు గత విద్యాసంవత్సరంలో విద్యార్థులు అసలే లేని కళాశాలలకు ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు దోస్త్‌లో కొన్నింటికి అవకాశం ఇవ్వలేదు. మరికొన్నింటికి ఇచ్చారు. ఫలితంగా ఆయా కళాశాలల్లో సీట్లు భర్తీ ఈ విద్యాసంవత్సరంలోనూ అంతంత మాత్రమేనని సమాచారం.
మూడుదశల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో కేయూ పరిధిలో గత నెల 27నుంచే క్లాస్‌లు ప్రారంభమయ్యాయి. స్పెషల్‌ఫేజ్ అడ్మిషన్లకు అవకాశం ఇచ్చినా అంతంతమాత్రమే సీట్లు భర్తీ అయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
Also read: Sports School: ఆగస్టు 13న క్రీడా పాఠశాలల్లో రాష్ట్రస్థాయి ఎంపికలు
కేయూ డిగ్రీ కళాశాలల్లో సగం కూడా భర్తీ కాని సీట్లు
287 కళాశాలల్లో మొత్తం 98,980 సీట్లు
34,959 సీట్లు మాత్రమే భర్తీ.. 64,021 ఖాళీ
ఇక స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ షురూ