AP EAPCET ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు
Sakshi Education
మురళీనగర్: ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ అడ్మిషన్లకు సంబంధించి వెబ్ ఆప్షన్లు గడువు పొడిగించినట్లు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కేడీవీ నరసింహారావు చెప్పారు.
ఈ ఆప్షన్లకు ఈనెల 7వ తేదీ నుంచి 12వరకు మొదట అవకాశం ఇచ్చారు. అయితే విద్యార్థులకు మరింత అవకాశం కల్పించేందుకు ఈ గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించారు. ఆప్షన్లను ఈనెల 16న మార్పు చేసుకోవచ్చు. 23న సీట్ల కేటాయింపు, 23 నుంచి 31వ తేదీ వరకు వారికి కేటాయించిన కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
AP EAPCET 2023 Web Options: ఈ సారి 75 ఇంజనీరింగ్ కోర్సులు... బ్రాంచ్ ఎంపికకు తొలి ప్రాధాన్యం!
ఆగస్టు 31వ తేది నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. మారిన షెడ్యూల్ దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
College Predictor - 2023 TS EAMCET | AP EAPCET
AP EAPCET 2023 Counselling: విద్యార్థులు ఏ బ్రాంచ్‌ను ఎంచుకోవాలి? ఏ కళాశాలలో చదివితే మంచిది?
Published date : 10 Aug 2023 05:29PM