AP EAPCET 2023 Web Options: ఈ సారి 75 ఇంజనీరింగ్ కోర్సులు... బ్రాంచ్ ఎంపికకు తొలి ప్రాధాన్యం!
విద్యార్థులకు ప్రధానంగా బ్రాంచ్, కాలేజీలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అనే సందేహం ఎదురవుతుంది. 'బ్రాంచ్ ఎంపికకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రాంచ్ ఎంపికలో తమ ఆసక్తి, అభిరుచికి పెద్దపీట వేయాలి. క్రేజ్ కోణంలోనే బ్రాంచ్‌లను ఎంపిక చేసుకోవడం సరికాదు. దీని వల్ల అకడమిక్‌గా రాణించలేకపోవచ్చు. ఇది భవిష్యత్తు గమ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉంది' అంటున్నారు నిపుణులు.
College Predictor - 2023 TS EAMCET | AP EAPCET
కాబట్టి బ్రాంచ్ ఎంపికలో ఆయా బ్రాంచ్‌ల సిలబస్, కరిక్యులం స్వరూపాన్ని పరిశీలించి... తమ సహజ ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవడం మేలు.
AP EAPCET 2023: Complete List of Engineering Courses
కావాల్సిందల్లా.. ఈ నైపుణ్యాలే..
రానున్న రోజుల్లో ఏఐ, డేటాసైన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ కొలువులు అధికంగా ఉండే అవకాశం ఉంది. బ్రాంచ్‌ఎంపికలో ఆసక్తి, అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్న నిపుణులు. నిరంతర అధ్యయనం, స్వీయ అభ్యసన నైపుణ్యాలుంటేనే రాణించే అవకాశం.
Top 20 Artificial Intelligence & Machine Learning (AI and ML)Engineering Colleges in Andhra Pradesh
వాస్తవానికి ప్రస్తుతం జాబ్ మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కావాల్సిందల్లా.. ఇండస్ట్రీ అవసరాలకు తగినట్లుగా తాజా నైపుణ్యాలను సొంతం చేసుకోవడమే. ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో లేటెస్ట్‌టెక్నాలజీ( ఇండస్ట్రీ 4.0 స్కిల్స్) ఆధారంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటే ఏ బ్రాంచ్‌విద్యార్థులకైనా.. భవిష్యత్తు అవకాశాలు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
బీటెక్‌లో ఏబ్రాంచ్ సెలక్షన్ చేసుకుంటే మంచిది..?
బీటెక్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థుల్లో ఎదురవుతున్న మొదటి సందేహం.. ఏ బ్రాంచ్‌సెలక్ట్‌చేసుకుంటే బాగుంటుంది?! అనేది. ఈ విషయంలో ప్రధానంగా రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవి..
1. వ్యక్తిగత ఆసక్తి, వ్యక్తిగత సామర్థ్యాలు.
2. జాబ్‌మార్కెట్ ప్రస్తుత పరిస్థితులు; విద్యార్థులు ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటూ.. భవిష్యత్తు అవకాశాలపై అంచనాతో తమ ఆసక్తికి అనుగుణంగా బ్రాంచ్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.బీటెక్‌తర్వాత కార్పొరేట్‌కొలువే లక్ష్యమైతే.. దానికి అనుగుణంగా వాస్తవ పరిస్థితుల్లో అమలవుతున్న తాజా నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
Top 20 Computer Science and Engineering Colleges in Andhra Pradesh
ఇంజనీరింగ్‌లో ప్రధాన బ్రాంచ్‌లు ఇవే..
సీఎస్ఈ (Computer Science and Engineering):
గత నాలుగేళ్లుగా టాప్ ర్యాంకర్లు సీఎస్‌ఈ బ్రాంచ్‌లోనే చేరారు. ఎందుకంటే.. జనరల్ కేటగిరీలో 1500లోపు ర్యాంకుతోనే అన్ని ఐఐటీల్లో ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అయిపోతున్నాయి. ఐఐటీలే కాకుండా.. ఎన్‌ఐటీలు, రాష్ట్రాల స్థాయిలోనూ ఇదే పరిస్థితి. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, టాప్-20 ఇన్‌స్టిట్యూట్‌లలో జనరల్ కేటగిరీలో అయిదు వేలలోపు ర్యాంకుతోనే ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అవుతున్నాయి.
కారణం.. ప్రస్తుతం సీఎస్‌ఈకి ఉద్యోగాల పరంగా మెరుగైన అవకాశాలు అందుబాటులో ఉండటమే. డిజిటలైజేషన్, ఆటోమేషన్ ఫలితంగా రాబోయే రోజుల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయనే వార్తలు కూడా విద్యార్థులు సీఎస్‌ఈ పట్ల ఆసక్తి చూపడానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
Top 20 Electronics and Communications Engineering(ECE) Colleges in Andhra Pradesh
ఈసీఈ (Electronics & Communication Engineering):
ఐఐటీల్లో జనరల్ కేటగిరీలో గత రెండేళ్లుగా సగటున మూడున్నర వేల లోపు ర్యాంకుతో ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అవుతున్నాయి. ఇతర టాప్ ఇన్‌స్టిట్యూట్‌ల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, స్మార్ట్ టెక్నాలజీస్, ఐటీసీ అమలు వంటి విధానాలతోపాటు, 5జీ టెక్నాలజీ స్థాయికి టెలికం రంగం విస్తరిస్తోంది. డిజిటల్ ఇండియా, డిజిటైజేషన్, డిజిటల్ లిటరసీ మిషన్ వంటి పలు పథకాలకు నాంది పడింది. దీంతో వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తోంది.
ఈఈఈ (Electrical and Electronics Engineering):
ఈఈఈగా సుపరిచితమైన ఈ బ్రాంచ్ కూడా విద్యార్థుల ఆదరణలో రెండు, లేదా మూడు స్థానాల్లో నిలుస్తోంది. ఈ బ్రాంచ్ పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తు పరంగా ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు 1.5 లక్షల మంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిపుణులు అవసరం ఏర్పడనుందని పరిశ్రమ వర్గాల అంచనా. 2025 నాటికి ఈ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలో స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాలనే దిశగా అడుగులు పడుతున్నాయి.
Top 20 Electrical and Electronics Engineering(EEE) Colleges in Andhra Pradesh
సివిల్ ఇంజనీరింగ్ (Civil Engineering):
మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో కట్టడాలు, డిజైన్లకు సంబంధించి మూల భావనలు, నైపుణ్యాలు అందించేలా ఈ కోర్సు స్వరూపం ఉంటుంది. జీపీఎస్, అర్బన్ డెవలప్‌మెంట్ వంటి పలు స్పెషలైజేషన్లకు రూపకల్పన జరిగినప్పటికీ.. వీటికి ఆధారం సివిల్ ఇంజనీరింగ్‌లోని మౌలిక సూత్రాలే. సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు అవసరమైన గృహ నిర్మాణాల కోణంలో రియల్టీ రంగంలో కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టడం కూడా ఈ బ్రాంచ్ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తోంది. సివిల్ ఇంజనీరింగ్‌లో రాణించాలంటే..డిజైన్, ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
Top 20 Civil Engineering Colleges in Andhra Pradesh
మెకానికల్ ఇంజనీరింగ్ (Mechanical Engineering):
రోజురోజుకీ కొత్త టెక్నాలజీలతో విస్తరిస్తున్న విభాగం..మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ అంటే ఠక్కున గుర్తొచ్చే వాహన పరిశ్రమ నుంచి.. బోయింగ్ విమానాల ఉత్పత్తి వరకూ.. ప్రతి విభాగంలోనూ మెకానికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల అవసరం ఏర్పడుతోంది. ఫలితంగా ఈ బ్రాంచ్ నిత్య నూతనంగా వెలుగులీనుతోంది. ఇటీవల కాలంలో ఈ విభాగంలో ఆధునికత దిశగా అడుగులు పడుతున్నాయి. రోబోటిక్స్,అన్‌మ్యాన్డ్ వెహికిల్స్ వంటి వాటిని వీటికి ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనొచ్చు.
Top 20 Mechanical Engineering Colleges in Andhra Pradesh
ఈ బ్రాంచ్ విద్యార్థులకు అకడమిక్ స్థాయిలోనే రోబోటిక్స్, క్యాడ్, క్యామ్, 3డి డిజైన్ టెక్నాలజీస్ వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్ ఆధారిత మెకా నికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు సొంతమవుతాయి. పైన పేర్కొన్న బ్రాంచ్‌లతోపాటు కెమికల్ ఇంజనీరింగ్; ఏరోస్పేస్ ఇంజనీరింగ్; బయో టెక్నాలజీ; బయోమెడికల్ ఇంజనీరింగ్; నావల్ ఆర్కిటెక్చర్/మెరైన్ ఇంజనీరింగ్; టెక్స్‌టైల్ టెక్నాలజీ వంటివి ముందంజలో నిలుస్తున్నాయి.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో..
బ్రాంచ్ ఎంపికలో విద్యార్థులు తమ వ్యక్తిగత ఆసక్తికే ప్రాధాన్యమివ్వడం మేలు. ఆసక్తి లేని బ్రాంచ్‌ను ఎంచుకుంటే.. అందులో అకడమిక్‌గా రాణించలేక.. భవిష్యత్తులో నిరుత్సాహానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆసక్తి లేని బ్రాంచ్‌ను ఎంచుకున్నా.. దానిపై ఇష్టం పెంచుకోవాలి. ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. క్లాస్ రూమ్ లెర్నింగ్‌కే పరిమితం కాకుండా.. లేటెస్ట్ నైపుణ్యాలు సొంతం చేసుకునేలా స్వీయ ప్రణాళికలు రూపొందించుకోవాలి.
- ప్రొ.ఎన్.వి.రమణరావు,డైరెక్టర్, నిట్‌వరంగల్