Skip to main content

B Tech Computer Science Course : ఇంజినీరింగ్‌లో కంప్యూట‌ర్ సైన్స్‌కే విద్యార్థుల ఓటు.. ఇందుకేనా..!

ఉమ్మడి కృష్ణా జిల్లా ఇంజినీరింగ్‌ విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌కే జై కొడుతున్నారు.
Majority students selects computer science course in engineering resulting software jobs

విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా ఇంజినీరింగ్‌ విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌కే జై కొడుతున్నారు. ఇంజినీరింగ్‌ కళాశాలలు అనేక విభాగాలకు చెందిన కోర్సులను నిర్వహిస్తున్నా.. అత్యధిక శాతం కంప్యూటర్స్‌కే తమ ఓటు అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 32 ఇంజినీరింగ్‌ కాలేజీలు, రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, వీఆర్‌ సిద్ధార్థ డీమ్డ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఆయా కళాశాలలకు సంబంధించి రెండు విడతలుగా కౌన్సెలింగ్‌ ప్రక్రియను పూర్తి చేశారు.

Railway Jobs: రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక

మొత్తం మీద ఆయా కళాశాలల్లో సుమారుగా 21 ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌కు డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగింది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ తర్వాత ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌కు విద్యార్థులు ప్రాధాన్యమిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా ఉండటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు దానిని గమనంలో పెట్టుకొని ఆయా బ్రాంచ్‌లవైపు మొగ్గుచూపారు.

NSS Volunteers: ట్రాఫిక్‌ విధుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు.. వలంటీర్ల మోహరింపు ఇలా...

26 కళాశాలల్లో 12,117 సీట్లు కేటాయింపు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 32 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉండగా అందులో రెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మొత్తం మీద సుమారుగా 19 వేల ఇంజినీరింగ్‌ సీట్లు ఉమ్మడి కృష్ణాజిల్లాలో అందుబాటులో ఉన్నాయి. అలాగే మరో నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలలు అంతంత మాత్రంగానే ఉండటం, సరైన అనుమతులు లేకపోవటంతో పూర్తి స్థాయిలో 26 ఇంజినీరింగ్‌ కళాశాలలకు విద్యార్థులు ఆసక్తి చూపారు. 26 కళాశాలలకు కన్వీనర్‌ కోటా కింద 14,088 సీట్లను కేటాయించాల్సి ఉంది. రెండు విడతలుగా జరిగిన కౌన్సెలింగ్‌లో మొత్తం 12,117 సీట్లను దరఖాస్తు చేసుకొని ప్రతిభ, రిజర్వేషన్లు తదితర అంశాల ప్రాతిపదికన ఉన్నత విద్యామండలి ఎంపిక చేసుకున్న బ్రాంచ్‌లలో విద్యార్థులకు సీట్లు కేటాయించింది. అదేవిధంగా 30 శాతం సీట్లను ఆయా కళాశాలలు మేనేజమెంట్‌ కోటా కింద అర్హులైన వారికి కేటాయిస్తాయి.

Anganwadi Centers : అంగ‌న్వాడీ కేంద్రాల్లో చిన్నారుల చ‌దువుపై నిర్ల‌క్ష్యం.. కారణం!

40 శాతానికి పైగా సీట్లు కంప్యూటర్స్‌కే..

కేటాయించిన సీట్లలో 40 శాతానికి పైగా కంప్యూటర్స్‌, దాని అనుబంధ విభాగాలకు చెందిన బ్రాంచ్‌లనే విద్యార్థులు ఎంచుకున్నారు. 26 కళాశాలల్లో ఒక్క సీఎస్‌ఈ బ్రాంచ్‌కు సంబంధించి 4,124 సీట్లు కేటాయింపు జరిగింది. ప్రస్తుతం మిషన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌(ఏఐ), డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటరింగ్‌ వంటి వాటి వల్ల సాఫ్ట్‌వేర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కంప్యూటర్స్‌కు అనుబంధంగా వాటికి సంబంధించిన కోర్సులను కళాశాలలు ప్రారంభించాయి. దాంతో ఆయా బ్రాంచ్‌లను సైతం విద్యార్థులు ఎంపిక చేసుకొని అభ్యసిస్తున్నారు.

యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి..

రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం, వీఆర్‌ సిద్ధార్థ డీమ్డ్‌ యూనివర్సిటీలోనూ సంప్రదాయ కోర్సులతో పాటుగా కంప్యూటర్స్‌కు సంబంధించిన కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవల నూతనంగా వస్తున్న వివిధ ఆవిష్కరణలతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మిషన్‌ లెర్నింగ్‌ వంటి అంశాలకు సంబంధించిన సబ్జెక్ట్‌లు ఉన్న కోర్సులకు ఆసక్తి చూపుతున్నారు.

ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌కే జై ఉమ్మడి జిల్లాలో 40 శాతం సీట్లు దాని అనుబంధ కోర్సులే ఆ తరువాత స్థానంలో ఈసీఈ రెండు విడతలుగా పూర్తయిన కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌

IBPS Notification 2024 : ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పోస్ట్‌కు ఐబీపీఎస్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

Published date : 16 Aug 2024 12:41PM

Photo Stories