AP EAPCET Final Phase Counselling: షెడ్యూల్ ఇదే... కాలేజీ ప్రిడిక్టర్ చూసి వెబ్ ఆప్షన్స్ ఎంచుకోండి !
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు అనంతరం రిజస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్, ఆప్షన్ల నమోదులో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌లో సంప్రదించవచ్చు.
AP EAPCET 2023 Final Phase Counselling Schedule:
- ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో 14 నుంచి 16వ తేదీ వరకు కళాశాలల ఆప్షన్ల ఎంపిక, బ్రాంచ్‌ల ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
- 17న ఆప్షన్ల మార్పునకు అవకాశం,
- 21న సీట్ల కేటాయింపు
- సీట్ల కేటాయింపు పూర్తయిన తర్వాత 22 నుంచి 25 మధ్య కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
ఏఏ ర్యాంక్‌కు.. ఏఏ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చిందో..?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. ఎంసెట్‌లో మీకు వచ్చిన ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) మీకోసం ప్రత్యేకం ఎంసెట్‌లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా.. ఏఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో తెలియజేయనున్నది. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. ఇది 2022 సంవత్సరంలో ఎంసెట్ ఏఏ ర్యాంక్‌కు.. ఏఏ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చిందో అనే దాని ఆధారంగా.. AP EAPCET College Predictor ను ఇవ్వనున్నది. అంతిమంగా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ఆధారంగానే మీ కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది.