JNTU Students: విద్యార్థులకు అభినందనలు.. కారణం..?
Sakshi Education
ప్రీ పరేడ్ కు ఎంపికైన జేఎన్‌టీయూ పరిధిలోని విద్యార్థులను వర్సిటీ వీసీ, తదితర అధ్యాపకులు అభినందించారు.
సాక్షి ఎడ్యుకేషన్: ప్రీ రిపబ్లిక్ పరేడ్ క్యాంప్‌లో ప్రాతినిథ్యం వహించే జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని విద్యార్థుల ఎంపిక ప్రక్రియ మంగళవారం నిర్వహించారు. ఎంపికైన వారిలో షేక్ సనా అంజుమ్, వై.యామిని (జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్), డీవీవీఎస్ చరిత (జేఎన్‌టీయూ–కలికిరి) ఉన్నారు.
➤ Open Schools Admissions: ఓపెన్ స్కూల్‌లో దరఖాస్తులు..
ఎంపికైన విద్యార్థులను జేఎన్‌టీయూ (ఏ) వీసీ డాక్టర్ జింకా రంగజనార్ధన, రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్ అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.శారద, డాక్టర్ జి.మమత, డాక్టర్ డి.విష్ణువర్ధన్, డాక్టర్ దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 01 Nov 2023 11:24AM