Skip to main content

Open Schools Admissions: ఓపెన్‌ స్కూల్‌లో దరఖాస్తులు..

Open Schools Admissions
Open Schools Admissions

ఆర్థిక ఇబ్బందులు, ఇతర వివిధ కారణాలతో మధ్యలో చదువుకు దూరమైన వారికి సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) మళ్లీ చదువుకునే అవకాశం కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ అక్బర్‌ అలీ తెలిపారు.

శనివారం ఉదయం సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత పోస్టర్లు ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం 2023–24 విద్యా సంత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ కోర్సులలో ప్రవేశాలు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని సంబేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఆసక్తి గల వారు ఇక్కడ సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ సుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెఢ్డి తదితరులు పాల్గొన్నారు.

Published date : 31 Oct 2023 08:25PM

Photo Stories