Polytechnic Admissions: స్పాట్ అడ్మిషన్లు పూర్తి
సాక్షి ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కాలేజీలో మిగులు సీట్లకు సంబంధించి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినట్లు కంచరపాలెం కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు. కాలేజీలో 14 ఖాళీలు ఉండగా వీటిలో 9 ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉన్నాయి. మిగతావి జనరల్ అండ్ రిజర్వేషన్ కేటగిరీలో మిగిలాయి. ఓపెన్ కేటగిరీలో 2, రిజర్వేషన్ కేటగిరీలో 3 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ లోని ఏయూ రీజియన్‌కు చెందిన 1 సీటు భర్తీ చేశారు. ప్రస్తుతం అభ్యర్థులు లేకపోవడం వల్ల ఎస్‌వీ యూనివర్సిటీ రీజియన్‌కు చెందిన 8 ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మిగిలిపోయాయి.
Tabs for Students: సాంకేతికతను పెంచేందుకు విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ
వీటిని మార్పు చేయడానికి వీల్లేదని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు. స్పాట్‌లో 4,700 కాలేజీ ఫీజు, రూ.700 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి జాయిన్ అయ్యారని, వీరికి తరగతులు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించిన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మెటలర్జీ నుంచి ఎలక్ట్రికల్ విభాగంలో స్లైడింగ్‌లో ఇద్దరు విద్యార్థులు చేరారు. సివిల్‌లో 2 ఖాళీలు భర్తీ చేశారు. మెటలర్జీలో ఏర్పడిన నాలుగు ఖాళీలు భర్తీ అయ్యాయి.