Skip to main content

Degree Colleges Admissions: 45 శాతం కూడా భర్తీ కాని సీట్లు.. 13 వరకు గడువు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ సీట్ల భర్తీని ప్రభుత్వం దోస్త్‌ ద్వారా చేపట్టింది.
students
students

రెండు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభించినా.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా గత నెల చివరి నాటికే మూడు దశల్లో పూర్తిచేయాలి. కానీ, ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కనీసం 45 శాతం కూడా సీట్లు భర్తీ కాలేదు. పీయూ పరిధిలో మొత్తం 21,740 సీట్లు ఉండగా.. ఇప్పటికే కౌన్సెలింగ్‌ పూర్తి అయినప్పటికి కేవలం 9,478 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకోవడం గమనార్హం. ప్రతి సంవత్సరం సాధారణంగా 65 శాతానికిపైగా అడ్మిషన్లు జరుగుతాయి. దీంతో మరోమారు ఆన్‌లైన్‌లో ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండగా 18 సీట్లు అలాట్‌ చేస్తారు.

Also read: Indian Airforce Recruitment 2023 : అగ్నివీర్‌ పోస్టులకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే !

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా..

ఉమ్మడి జిల్లాలో మొత్తం 60 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు జరిగాయి. అయితే చాలా కళాశాలల్లో కనీసం 45 నుంచి 50 శాతం కూడా భర్తీ కాలేని పరిస్థితి నెలకొంది. 

Also read: Velugu Abhyasamithra: విద్యార్థుల్లోని సామర్థ్యాలు వెలికితీయాలి: నోడల్‌ అధికారి వెంకటయ్య

మొదటి దశ కౌన్సెలింగ్‌ వివిధ ప్రైవేట్‌ కళాశాలల్లో ఉన్న కోర్సుల్లో 25 శాతం సీట్లు భర్తీ కాకపోతే, సంబంధిత కళాశాలల్లో కోర్సులను అధికారులు రద్దు చేస్తున్నారు. అప్పటి వరకు జరిగిన అడ్మిషన్లను ఇరత కళాశాలలకు బదిలీ చేసి విద్యార్థులకు అక్కడ తరగతులు బోధిస్తున్నారు. కొన్ని కోర్సుల్లో అడ్మిషన్లు తక్కువ అయినా విద్యార్థులను అలాగే కొనసాగిస్తే కళాశాల నిర్వహణ యాజమాన్యానికి భారంగా మారి, వారికి బోధన, ప్రయోగాలు తదితర అంశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also read: Primary School Level: ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌పై పట్టుసాధించాలి

ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో కనీసం 5 కళాశాలలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని, వాటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

●ఇదిలా ఉండగా.. ఉమ్మడి జిల్లాలోని 20 ప్రభుత్వ కళాశాలల్లో పెద్దఎత్తున సీట్లు భర్తీ అయినట్లు తెలుస్తుంది. చాలామంది విద్యార్థులు ఎలాంటి ఫీజులు లేకుండా ఆన్‌లైన్‌లో మొదటి ప్రాధాన్యత కింద ప్రభుత్వ కళాశాలల ఆప్షన్‌ ఇచ్చుకున్నారు. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం డిమాండ్‌ ఉన్న కొత్త కోర్సులను సైతం అందుబాటులోకి తీసుకురావడంతో విద్యార్థులు అటువైపు మొగ్గుచూపారు.

Also read: Admissions: ఆయుర్వేద వైద్యకళాశాలలో అడ్మిషన్లకు అనుమతి

ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..

  • ఇప్పటికే దోస్త్‌ ద్వారా
  • మూడు దశల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ
  • 25 శాతంలోపు అయిన కళాశాలల కోర్సులు ఇతర వాటికి బదిలీ
  • ప్రశ్నార్థకంగా మారిన
  • పలు ప్రైవేటు కాలేజీల భవితవ్యం
  • స్పెషల్‌ ఫేజ్‌ కింద అడ్మిషన్లకు
  • 13 వరకు గడువు

Also read: KU degree colleges: 64,021 ఖాళీలు.. స్పెషల్‌ ఫేజ్‌కు అడ్మిషన్ల ప్రక్రియ షురూ..

స్పెషల్‌ ఫేజ్‌కు అనుమతి..

పీయూ పరిధిలో ప్రభుత్వం దోస్త్‌ ద్వారా సీట్ల భర్తీకి మూడు దశల్లో ప్రక్రియ చేపట్టిన పూర్తిస్థాయిలో కాలేదు. దీంతో మరోసారి స్పెషల్‌ ఫేజ్‌కు అనుమతి ఇచ్చింది. అలాగే 25 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు జరిగిన కళాశాలల్లో ఉన్న పలు కోర్సులను ఇరత కళాశాలలకు బదిలీ చేయాలని ప్రభుత్వం సూచించింది.

– చంద్రకిరణ్‌, అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌, పీయూ

Also read: Andhra Pradesh: Parents and Teachers Meeting in AP Govt Schools #sakshieducation

అత్యధికంగా బీఎస్సీలోనే..

పీయూ పరిధిలో ప్రైవేటు కళాశాలతోపాటు రెండు ప్రభుత్వ కళాశాలల్లో సైతం తక్కువగా అడ్మిషన్లు తక్కువ కావడం పట్ల అధికారులు కారణాలను వెతికే పనిలో ఉన్నారు. ప్రధానంగా గురుకులాల్లో డిగ్రీ కోర్సులు రావడంతో వారు నేరుగా సంబంధిత బోర్డుల ద్వారానే విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. అలాగే ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాలకు మెడికల్‌ కళాశాలలు మంజూరవడంతోపాటు చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, అగ్రికల్చర్‌ కోర్సులపై మక్కువ చూపుతున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే బీకాం, బీఏ వంటి కోర్సులతో పోల్చితే బీఎస్సీలోనే అధికంగా 3,862 మంది విద్యార్థులు జాయిన్‌ కాగా.. మిగతా వాటిలో తక్కువ అడ్మిషన్లు జరిగాయి.

Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation

Published date : 10 Aug 2023 05:28PM

Photo Stories