Admissions: ఆయుర్వేద వైద్యకళాశాలలో అడ్మిషన్లకు అనుమతి
Sakshi Education
కాశిబుగ్గ: వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వే ద వైద్య కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరా నికి సంబంధించి అడ్మిషన్లకు అనుమతి లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ విజయగణేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్(ఎన్‌సీఐఎస్‌ఎం) షరతులతో కూడిన అనుమతి ఇచ్చిందన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపా రు. ప్రవేశాల కోసం ఎన్‌సీఐఎస్‌ఎం తనిఖీలకు స హకరించిన ఆస్పత్రి సూపరింటెండెంట్, సిబ్బంది, ఫ్యాకల్టీ మెంబర్లు, కళాశాల సిబ్బంది, రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ హరిచందనకు కృతజ్ఞతలు తెలిపారు.
Also read: Admissions in Andhra University: యోగా శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Published date : 10 Aug 2023 05:00PM