Skip to main content

UGC NET 2024: సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్ 2024 నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) జూన్‌–2024కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
UGC NET  June 2024 UGC NET notification  Research and teaching opportunity  Assistant Professor qualification  PhD admissions  CSIR UGC NET 2024 Notification release with registration link  National Testing Agency

»    సబ్జెక్ట్‌లు: కెమికల్‌ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్‌ సైన్సెస్, మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
»    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు/నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌ఎంఎస్‌/బీఈ/బీటెక్‌/బీఫార్మసీ/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌ జెండర్, దివ్యాంగ అభ్యర్థులు  కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
»    వయసు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు జూన్‌ 2024 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ(నాన్‌ క్రిమిలేయర్‌)లకు మూడేళ్ల గరిష్ట వయోసడలింపు ఉంటుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ /పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
»    పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.

TS EAMCET 2024: టీఎస్‌ ఇంజనీరింగ్‌ సెట్‌ పరీక్ష.. ఎక్కువ ప్రశ్నలు ఆ చాప్టర్ల నుంచే..

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.05.2024
»    ఫీజు చెల్లింపు చివరితేది: 23.05.2024.
»    దరఖాస్తు సవరణ తేదీలు: 25.05.2024 నుంచి 27.05.2024 వరకు.
»    పరీక్షల తేదీలు: 25.06.2024, 26.06.2024, 27.06.2024.
»    వెబ్‌సైట్‌: https://csirnet.nta.ac.in

Job Offer: ఏపీ ఎమ్‌ఎస్‌ఆర్‌బీలో ఒప్పంద ప్రాతిపదికన ట్యూటర్‌ పోస్టులు..

Published date : 10 May 2024 01:01PM

Photo Stories