Primary School Level: ఉపాధ్యాయులు ఇంగ్లిష్‌పై పట్టుసాధించాలి
Sakshi Education
మర్కూక్(గజ్వేల్): ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఆంగ్ల బోధన నైపుణ్యాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి కోరారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కూక్‌లో మండలస్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్ ఉపాధ్యాయ శిక్షణ సమావేశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పకడ్బంధీగా శిక్షణ తరగతులను అమలు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Also read: Admissions in Andhra University: యోగా శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Published date : 09 Aug 2023 03:52PM