D.Ed Semester Exams: డీఎడ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం.. షెడ్యూల్ ఇలా..
యడ్లపాడు: డీఎడ్ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని బోయపాలెం ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్‌ఎం. సుభాని తెలిపారు. ఆదివారం పరీక్షల వివరాలను తెలియజేశారు. కళాశాలలో 2022–24 విద్యా సంవత్సరంలో అభ్యసించే విద్యార్థులకు మూడో సెమిస్టర్ పరీక్షలు మొదలవుతాయని పేర్కొన్నారు. 22న పెడగాగి ఆఫ్ ఇంగ్లిష్ ప్రైమరీ లెవల్–1, 23న పెడగాగి ఆఫ్ ఈవీఎస్ ఎట్ ప్రైమరీ లెవల్–1, 24న పెడగాగి ఆఫ్ ఎలిమెంటరీ లెవల్ ఆప్షనల్ సబ్జెక్టు, 25న కాన్‌టెంప్రరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా –1, 26న ఇంటిగ్రేటింగ్ జండర్ అండ్ ఇన్‌క్లూజివ్ ఫర్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, 27న స్కూల్ కల్చర్ లీడర్‌షిప్ అండ్ టీచర్ డెవలప్‌మెంట్ పరీక్షలు ఉంటాయని వివరించారు.
National Civil Services Day: ఏప్రిల్ 21వ తేదీ జాతీయ పౌర సేవల దినోత్సవం.. ఈ రోజు ప్రత్యేకతలు ఇవే..
2023–25 విద్యార్థులకు ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు అదేరోజు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. 22న పెడగాగి ఆఫ్ మదర్‌టంగ్ (తెలుగు/ఉర్దూ/తమిళం), 23న పెడగాగి ఆఫ్ మాథ్య్ ఎట్ ప్రైమరీ లెవల్ –1, 24న పెడగాగి ఎక్రాస్ కరిక్యూలం అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్, 25న చైల్డ్‌హుడ్, చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ అండ్ లెర్నింగ్, 26న సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరిక్యూలమ్, 27న ఎర్నీ చైల్డ్‌కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ) పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.
World Record: స్వీడన్ పోల్‌వాల్ట్ స్టార్ డుప్లాంటిస్ ప్రపంచ రికార్డు
థర్డ్ సెమిస్టర్ విద్యార్థులు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో సబ్జెక్టులు మిగిలినపోయిన వారు కూడా ఇదే పరీక్ష సమయంలో ఆయా బ్యాచ్‌లతో హాజరై పరీక్షలు రాయవచ్చని ఆయన సూచించారు.