Govt Women's Degree College: మహిళా డిగ్రీ కళాశాల పరిశీలన
![Consideration of Women's Degree College](/sites/default/files/images/2023/08/05/womens-degree-college-1691229185.jpg)
మదనపల్లె సిటీ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీని శుక్రవారం న్యాక్‌పీర్ కమిటీ పరిశీలించింది. కమిటీ చైర్మన్ డాక్టర్ అల్కా మంజల్, సభ్యులు కొట్రేష్, డాక్టర్ నీనా సేఠ్ పజ్నిలు కాలేజీని అన్ని శాఖలను సందర్శించి తనిఖీలు చేశారు. కాలేజీ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వేర్వేరుగా సమావేశమై కాలేజీ స్థితిగతులు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో న్యాక్ కో ఆర్డినేటర్ మోహన్‌బాబు, ఐక్యూసి కోఆర్డినేటర్ విష్ణుప్రియ, అధ్యాపకులు మోహన్‌వల్లి, వనజ, నమ్రత, ఖజావల్లి తదితరులు పాల్గొన్నారు.
నేడు హెచ్‌ఎంలతో సమావేశం
రాయచోటిటౌన్: నాడు – నేడు ఫేజ్–2లో భాగంగా మదనపల్లె నియోజక వర్గ పరిధిలోని ప్రధానోపాధ్యాయులకు మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సమావేశం నిర్వహించనున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం పురుషోత్తం శుక్రవారం పేర్కొన్నారు. అధ్యాపకులు ఉదయం 10గంటలకు రావాలని, రికార్డులు తీసుకరావాలని తెలిపారు.
Sports: విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి
స్టార్ మిస్ టీన్ ఇండియాగా రాజంపేట అమ్మాయి
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెంది న వక్కలగడ్డ విష్ణు చౌదరి, ఉత్తరల కుమార్తె ధనూషసాయి దుర్గాచౌదరి స్టార్ మిస్ టీన్ ఇండియాగా ఇంటెలిజెంట్ 2023కు విజేతగా నిలిచింది. ధనూషసాయి దుర్గాచౌదరి(15) విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రాజస్థాన్‌లో జరిగిన స్టార్ మిస్ టీన్ ఇండియా ఇంటెలిజెంట్‌లో పలు రాష్ట్రాల నుంచి పాల్గొన్న ఎంతో మందిని దుర్గా ఓడించింది. చక్కటి తెలుగు మాట్లాడటమే కాకుండా, డ్యాన్స్ ట్యాలెంట్, తెలివితేటలు, కమ్యూనిటీ సర్వీస్, ర్యాంప్ వాక్, ప్రశ్న– సమాధానాలు, అద్భుతమైన ప్రదర్శన చేసి విజేతగా నిలిచింది. అన్నమయ్య జిల్లా కాకతీయ సేవా సమితి, కువైట్ కాకతీయ కమ్మ సేవాసమితి, ఆధ్వర్యంలో కాకతీయ సేవా సమితి అధ్యక్షుడు గొల్లపూడి శివనారాయణ చౌదరి శుక్రవారం ధనూషను సత్కరించి మెమెంటోను అందజేశారు.