Skip to main content

Sports: విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి

జగిత్యాలటౌన్‌: విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య సమావేశం జరిగింది.
సమావేశంలో పాఠశాల క్రీడా సమాఖ్య సభ్యులు
సమావేశంలో పాఠశాల క్రీడా సమాఖ్య సభ్యులు

ఈసందర్భంగా డీఈవో మాట్లాడారు. జిల్లా స్థాయి క్రీడలకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. గతంలో ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీగా పని చేసిన శ్రీనివాస్‌ తన 2 సంవత్సరాల పీరియడ్‌లో నిర్వహించిన క్రీడా పోటీల వివరాలు, కార్యదర్శి నివేదికను సమావేశంలో చదివి వినిపించారు. అనంతరం ఎస్‌జీఎఫ్‌ నూతన సెక్రెటరీగా లక్ష్మీరాంనాయక్‌ను డీఈవో నియమించారు. సమావేశంలో పెటా అధ్యక్ష, కార్యదర్శులు పడాల విశ్వప్రసాద్‌, ఎస్‌.అశోక్‌, పీఈటీలు కృష్ణప్రసాద్‌, భాస్కర్‌రెడ్డి, అజయ్‌బాబు, తిరుమలేశ్‌, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు.

Also read: APOSS: టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

Published date : 04 Aug 2023 04:35PM

Photo Stories