APOSS: టెన్త్, ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే
చదువుకు దూరమైన, బడిమధ్యలో మానేసిన వారితో పాటు పదో తరగతి తప్పినవారికి, టెన్త్ చదివే సామర్ధ్యం కలిగి, ఎటువంటి విద్యార్హత లేనప్పటికీ 14 ఏళ్ల వయసు నిండిన వారందరూ 10వ తరగతిలో ప్రవేశం పొందవచ్చు. అదేవిధంగా టెన్త్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌లో ప్రవేశం పొందే వీలుంది. రెగ్యులర్ ఇంటర్‌తో సమాన గుర్తింపు కలిగిన దూరవిద్య ఇంటర్‌ను ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయవచ్చు. 2023–24 విద్యాసంవత్సరానికి ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్, ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. దూరవిద్య టెన్త్, ఇంటర్ కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు ఏపీఓఎస్‌ఎస్ ప్రతి ఆదివారం కాంటాక్ట్ తరగతులను నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లోని నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులే స్వయంగా తరగతులను బోధిస్తారు.
Also read: CM Jagan Good News: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల #sakshieducation
ఈనెలాఖరు వరకు ప్రవేశాలు..
దూర విద్య టెన్త్, ఇంటర్లో ప్రవేశానికి ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 31వ తేదీవరకు అడ్మిషన్ ఫీజు చెల్లించవచ్చు. టెన్త్‌లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి పాటు జనరల్ కేటగిరీ పురుషులు రూ.1,550, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు, శారీరక వైకల్యం గల వారు రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు రూ.1,150 చెల్లించాలి.
Also read: CM Jagan Good News: Benefits for AP MBBS Aspirants | 100% Seats #sakshieducation
ఇంటర్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి జనరల్ కేటగిరీకి చెందిన పురుషులు రూ.1,800, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు, శారీరక వైకల్యం గల అభ్యర్థులు రూ.1,500 చెల్లించి ఇంటర్నెట్ కేంద్రాలు, ఏపీ ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంది. అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
Also read: Pranav Civils 60th Ranker: ఓటమి చూసి నిరాశ వొద్దు.. ఓటమి నుంచి నేర్చుకున్నపుడే విజయం సాకారమవుతుంది.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్,
ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
ఈనెలాఖరు వరకు అపరాధ
రుసుం లేకుండా ప్రవేశాలు