AU Graduation Ceremony: ఏయూ విద్యార్థులకు స్నాతకోత్సవం
![andhra university graduation ceremony, Four-Year Student Graduates](/sites/default/files/images/2023/09/11/au-1694421972.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మందిరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్నాతకోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగేళ్లకు కలిపి నిర్వహిస్తున్న సంయుక్త స్నాతకోత్సవంలో సైన్స్–పరిశ్రమల రంగంలో అవంతి ఫీడ్స్ ఎం.డి. అల్లూరి ఇంద్రకుమార్‌కు, సాహిత్య రంగంలో ఎస్‌వీ యూనివర్సిటీ పూర్వ వీసీ కొలకలూరి ఇనాక్‌లకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేస్తున్నారు.
Students Education: గ్రామ విద్యార్థులకు ఎస్ఐ శివకుమార్ ప్రోత్సాహం
ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. స్నాతకోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. డాక్టరేట్ డిగ్రీలు, మెడల్స్ తీసుకునే వారికి ప్రత్యేకమైన సీటింగ్ ఏర్పాటు చేశారు. వారికి కేటయించిన నంబర్లలో మాత్రమే వారు కూర్చోవాల్సి ఉంటుంది. వీరితో పాటు వచ్చే కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రతీ 20 సీట్లకు ఒక వలంటీర్ సమన్వయం చేయనున్నారు. ఉదయం 10 గంటలనుంచి వీరిని ప్రాంగణంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఎవ్వరినీ లోపలికి అనుమతించరు.
690 మందికి పీహెచ్‌డీలు
స్నాతకోత్సవంలో 690 మండి పీహెచ్‌డీలు, 600 మంది వరకు మెడల్స్, ప్రైజ్‌లను తీసుకోనున్నారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు తీసుకునే వారికి అసెంబ్లీ మందిరం వద్ద గౌన్‌లు అందుబాటులో ఉంచుతున్నారు. స్నాతకోత్సవం వీక్షించే వారికి అసెంబ్లీ మందిరంలో ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్నాతకోత్సవాన్ని పూర్తిగా యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
Degree Examinations: సెమిస్టర్ పరీక్షలో ఫెయిల్ అయిన వారికి ఇన్‌స్టంట్ పరీక్ష
ఏర్పాట్లను పరిశీలించిన భద్రతా సిబ్బంది
గవర్నర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం స్నాతకోత్సవ మందిరాన్ని సందర్శించి, భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.గవర్నర్ ప్రయాణించే వాహనాలతో కూడిన కాన్వాయ్ స్నాతకోత్సవ మందిరానికి వచ్చింది. గవర్నర్ సుమారు రెండు గంటల సమయం ఏయూలో గడపనున్నారు. గవర్నర్ కోసం వేదికకు ఎడమవైపున గ్రీన్‌రూం ఏర్పాటు చేశారు.
తొలిసారిగా ఏయూకు గవర్నర్
చాన్సలర్ హోదాలో హాజరు
నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం