Alumni Donation: కళాశాలకు పూర్వ విద్యార్థులు అందించిన విరాళం..
చోడవరం రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల సౌకర్యార్ధం టాయిలెట్స్ నిర్మాణం కోసం 1974 బ్యాచ్ విద్యార్థులు రూ.1.24 లక్షలు వితరణగా అందజేశారు. ఈ మేరకు శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ టి.రాధాకృష్ణను కలసిన పూర్వ విద్యార్థుల బృందం ప్రతినిధులు తమ విరాళం చెక్కును అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల కన్నా విద్యార్థినులే అధిక సంఖ్యలో విద్యార్జన చేస్తున్నారని, వారు వాష్‌రూం కొరకు తీవ్ర అవస్థలు పడుతున్నారని, ఈ సమస్యను పూర్వ విద్యార్థులు పరిష్కరించడం సంతోషదాయకమన్నారు.
Distance Education: దూరవిద్య కోర్సులకు ప్రవేశాల నోటిఫికేషన్
పూర్వ విద్యార్థి సంఘం ప్రతినిధులు బీజేసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈర్లె శ్రీరామ్మూర్తి, డాక్టర్ దుర్గాప్రసాద్, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాము ఇటీవలే కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించామని ఆ సమయంలో తాము చదువుకున్న కళాశాలకు ఏదైనా మంచి పని చేయాలని నిర్ణయించామన్నారు. దీంట్లో భాగంగా లేడీస్ టాయిలెట్ల కోసం తామంతా ఆర్థికంగా సహకరించామని, భవిష్యత్‌లో విద్యార్థుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్స్ సదుపాయాలు సమకూర్చనున్నట్టు తెలిపారు.
Group 2 Exam Instructions: గ్రూప్-2 పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచనలు, ఇవి అస్సలు మర్చిపోవద్దు
పూర్వ విద్యార్ధి బృందానికి ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం కృతజ్ఞతాభినందనలు తెలిపింది. కార్యక్రమంలో కళాశాల అల్యూమిన్ని కో ఆర్డినేటర్ జి.నారాయణమూర్తి, సీనియర్ లెక్చరర్లు ఎస్‌ఎం.రఫీయుద్దీన్, సుధీర్, వి.అప్పలనాయుడు, ఎన్‌ఎస్‌ఎస్ పివోలు రత్నభారతి, బి.పిచ్చమ్మ, డి.మాల్యాద్రి, సూర్యవతి, జ్యోతి, ఐ.వి.వి సత్యవతి, కృష్ణారావు పాల్గొన్నారు.