13th Graduation Day: వ్యవసాయ వర్సిటీలో స్నాతకోత్సవం వేడుకలు..
రాయచూరు: రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవాన్ని ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్సలర్ హనుమంతప్ప పేర్కొన్నారు. మంగళవారం వర్సిటీలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ ధావర్‌చంద్ గెహ్లాట్ ప్రారంభిస్తారన్నారు.
Doctor Posts: వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానంలో పోస్టుల భర్తీ..
ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖా మంత్రి చెలువరాయ స్వామితో పాటు ఎస్.ఎన్.ఝా, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు. 363 మంది డిగ్రీ విద్యార్థులకు, 127 మంది పీజీ విద్యార్థులకు, 26 మంది విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు అందిస్తారన్నారు. ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.103 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. విలేఖర్ల సమావేశంలో వీరనగౌడ, దేశాయి, జాగృతి నిడగుందిలున్నారు.
Bio Asia Summit: రూ.లక్ష కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి.. 5 లక్షల మందికి ఉద్యోగాలు