Skip to main content

New Medical Colleges: 17 మెడికల్‌ కాలేజీలు... 4,735 ఎంబీబీఎస్‌ సీట్లు - సీఎం జగన్‌

విజయనగరం జిల్లాలో మెడికల్‌ కాలేజీ ప్రారంభం అనంతరం సీఎం జగన్‌ కామెంట్స్‌.
New Medical Colleges in Vizianagaram,CM YS Jagan,Vizianagaram's Healthcare Advancement,Telugu Speech,Medical College Inauguration,

ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఐదు మెడికల్‌ కాలేజీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం గాజులరేగలో 70 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీ ప్రారంభించి.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారాయన.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ...

  • ఈరోజు నిజంగా దేవుడి దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 
  • రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్‌ కాలేజీలను కట్టే కార్యక్రమం మొదలు పెట్టాం.
  • అందులో 5 మెడికల్‌ కాలేజీల్లో ఈరోజు పిల్లలు అడ్మిషన్లు తీసుకొని డాక్టర్లుగా అడుగులు వేస్తున్నారు. 
  • నిజంగా ఈ మెడికల్‌ కాలేజీల నుంచి మీరు నేర్చుకొనే ఈ చదువు ద్వారా మీకు వచ్చే ఈ శిక్షణ ద్వారా తర్వాత మీరు చేసే సేవ ద్వారా రాబోయే రోజుల్లో, సంవత్సరాల్లో మీరందరూ ఇంకా మంచి పేరు తెచ్చుకొని గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా ఆకాంక్షిస్తున్నా. 
  • ఈరోజు 5 మెడికల్‌ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రారంభించాం.
  • 5 చోట్ల ఫస్టియర్‌ అడ్మిషన్లకు కూడా ఈరోజు పిల్లలను తీసుకొనే పరిస్థితిలోకి అడుగులు వేగంగా ముందుకు వేయగలుగుతున్నాం. 
  • వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను మళ్లీ అడ్మిషన్‌ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. 
  • దాని తర్వాత మళ్లీ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు అడ్మిషన్‌ స్థాయిలోకి తీసుకొస్తాం. 
  • ఈ సంవత్సరం 5, మళ్లీ 5, మళ్లీ 7 మొత్తంగా 17 మెడికల్‌ కాలేజీలను తీసుకుని రాగలుగుతున్నాం. 

Not all Angels have wings... ! Some have stethoscope... సీఎం వైఎస్ జగన్ అద్భుతమైన వాక్యం!!

ప్రతి పార్లమెంటు స్థాయిలో ఒక మెడికల్‌ కాలేజీ

YS Jagan in Vizianagaram
  • ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంటు స్థాయిలో ఒక మెడికల్‌ కాలేజీ పెట్టే కార్యక్రమం ఇనీషియేట్‌ చేస్తున్నాం. 
  • దీని వల్ల ఏం జరుగుతుందంటే టెరిషరీ కేర్‌ అన్నది ప్రతి పార్లమెంటు స్థాయిలోకి మనం తీసుకొని పోగలుగుతాం. 
  • ఎప్పుడైతే మెడికల్‌ కాలేజీ అవైలబుల్‌గా ఉంటుందో అప్పుడు ఆ మెడికల్‌ కాలేజీతో పాటు ప్రొఫెసర్లుగానీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్లుగానీ వీళ్లందరూ అవైలబుల్‌గా ఉండటం కూడా ఒక గొప్ప మార్పు టెరిషరీ కేర్‌లో జరుగుతుంది. 
  • టెరిషరీ కేర్‌ పెరగడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. 
  • ఇది ఒక ఎత్తయితే వేల మంది పిల్లలను మంచి డాక్టర్లుగా తయారు చేసే గొప్ప ఇన్‌స్టిట్యూషన్స్‌ను కూడా రాష్ట్రంలో క్రియేట్‌ చేయగలుగుతున్నాం. 
  • స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు 11 మాత్రమే ఉన్నాయి. 
  • కేవలం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దేవుడి దయతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా అధికారం డీసెంట్రలైజ్‌ చేయగలిగాం. 

17 మెడికల్‌ కాలేజీలు... 4,735 ఎంబీబీఎస్‌ సీట్లు

  • అది కాకుండా మరో 17 మెడికల్‌ కాలేజీలను యాడ్‌చేసి 28 మెడికల్‌ కాలేజీల దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. 
  • 17 మెడికల్‌ కాలేజీలను కట్టడానికి దాదాపు రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 
  • ఈ కాలేజీల వల్ల కొత్తగా మరో 2,250 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి అదనంగా రానున్నాయి. 
  • ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్‌ సీట్లు 2,185. 
  • ఈ 17 మెడికల్‌ కాలేజీలు రావడంతో ఈ ఎంబీబీఎస్‌ సీట్లు ఏకంగా 4,735కు పెరుగుతాయి. 
  • ఇవే కాక ఉన్న ఎగ్జిస్టింగ్‌ మెడికల్‌ కాలేజీలన్నింటిలోనూ సదుపాయాలన్నీ అప్‌గ్రేడ్‌ చేయగలిగాం.
  • ఆల్‌ ది పెండింగ్‌ వేకెన్సీస్, విత్‌ ఎ జీరో వ్యాకెన్సీ పాలసీ తీసుకుని రావడం వల్ల దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే 609 కొత్త పీజీ సీట్లు అందుబాటులోకి రాగలిగాయి. 
  • భవిష్యత్‌లో మరో 2,737 పీజీ సీట్లు కూడా వీటి ద్వారా రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. 
  • ఇవన్నీ ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తోందంటే, మీరంతా కూడా మంచి డాక్టర్లు కావాలి, మీరంతా కూడా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి రావాలని అన్నది ఐ డిజైర్‌. 
  • యాజ్ ఎ లీడర్, విజనరీస్‌, దిస్‌ ఈజ్‌ అవర్‌ డిజైర్‌.
  • ఈరోజు ప్రారంభం అవుతున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల... ఈ 5 మెడికల్‌ కాలేజీల్లో దాదాపు 750 ఎంబీబీఎస్‌ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారు. 
  • రేపు సంవత్సరం పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, ఇలాంటి బ్యాక్‌వర్డ్‌ ఏరియాల్లో కూడా మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. 
  • 2024–25లో మరో 750 మెడికల్‌ సీట్లు వస్తాయి.
  • ఆ తర్వాత 2025–26లో గిరిజన ప్రాంతాలు, డిస్టెంట్‌గా ఉన్న ఏరియాల్లో టెరిషరీ కేర్‌ దొరకడం కష్టం అన్న ప్రాంతాల్లో పార్వతీపురం, నర్సీపట్నం లాంటి చోట్ల కూడా 2025–26లో మెడికల్‌ కాలేజీలు రాబోతున్నాయి. 
  • 1050 సీట్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. 

2019 నర్సింగ్‌ సీట్లు

  • ఈ ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ కాలేజీల్లో సీట్లు మాత్రమే కాకుండా గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజీలను డెవలప్‌ చేస్తున్నాం. 
  • ఇప్పటి వరకు దాదాపు 1090 నర్సింగ్‌ సీట్లు ఉంటే మరో 18 నర్సింగ్‌ కాలేజీలను తీసుకొస్తున్నాం. 
  • వీటి ద్వారా మరో 1200 నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. 
  • మొత్తంగా 2019 నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 
  • ఉన్న 11 మెడికల్‌ కాలేజీల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఎన్‌ఏబీహెచ్, ఎన్‌ఎఫ్‌సీ మార్గదర్శకాలకు అనుగుణంగా కాలేజీలను నాడు–నేడు ద్వారా అన్నింటినీ అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. 
  • నాడు–నేడు కార్యక్రమాలు అన్నింటి మీద దాదాపు రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నాం. 

10,032 విలేజ్‌ క్లినిక్స్‌

  • ఈరోజు ఒకసారి గమనించమని అడుగుతున్నా. ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయిలో నుంచి మార్పులు తీసుకొస్తున్నాం. 
  • ఒకపక్క క్యూరేటివ్‌ క్యూర్‌ ఎంత అవసరమో, ప్రివెంటివ్‌ కేర్‌ కూడా అంతే అవసరం. దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా అడుగులు పడటం జరిగింది. 
  • ప్రివెంటివ్‌ కేర్‌లో ఎప్పుడూ చూడని అడుగులుపడ్డాయి. 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటయ్యాయి.
  • ఆ విలేజ్‌ క్లినిక్స్‌లో సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉంటారు. 
  • గ్రామస్థాయిలో 105 రకాల మందులు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. 14 రకాల డయోగ్నస్టిక్‌ టెస్టులు చేస్తారు. 
  • మరో 542కు సంబంధించిన అర్బన్‌ క్లినిక్ష్‌ తీసుకొచ్చాం. 
  • ఈ విలేజ్‌ క్లినిక్స్‌ను ప్రివెంటివ్‌ కేర్‌ దిశగా అడుగులు వేయిస్తున్నాం. 
  • ప్రతి మండలానికీ కనీసం 2 పీహెచ్‌సీలు ఉండేట్లుగా చేస్తున్నాం. ఇద్దరు డాక్టర్లు ఉండేట్లు చేస్తున్నాం. 
  • ప్రతి పీహెచ్‌సీలోనూ నలుగురు డాక్టర్లు, ఒక 104 వాహనం ఉండేట్లు చేస్తున్నాం. 
  • ప్రతి నెలా గ్రామానికి 2 సార్లు వెళ్లేటట్లు చేస్తున్నాం. 
  • దీని వల్ల 6 నెలల్లో ఎవరికి ఏ రోగముంది, ఎవరికి బీపీ, షుగర్, ఏ రకమైన ప్రాబ్లమ్స్‌ ఉన్నాయని పూర్తిగా చెప్పే ఒక ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తెచ్చాం. 

2,204 అంబులెన్స్‌ వాహనాలు

YS Jagan
  • గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో మందులు తీసుకుంటే నయం కాదు అని చాలా మంది అనుకుంటారు. 
  • ఈరోజు అన్ని గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో జీఎంపీ మందులు మాత్రమే ఆంధ్రరాష్ట్రంలో ఉన్నాయి. 
  • ఆరోగ్యశ్రీ సేవలు మనం రాకముందు నామమాత్రంగా ఉండేవి. 
  • 1050 ప్రొసీజర్లు ఉంటే, ఈరోజు 30255 ప్రొసీజర్లకు విస్తరించాయి. 
  • క్యాన్సర్‌ దగ్గర నుంచి కాక్లియర్‌ ఇంప్లాంట్‌దాకా కవర్‌ అవుతున్నాయి. 
  • వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలని తపన, తాపత్రయంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తున్నాం. 
  • గతంలో ఆరోగ్యశ్రీ ఎంపానెల్‌ 900 హాస్పిటల్స్‌ ఉంటే, ఈరోజు 2285కు విస్తరించాయి. 
  • గతంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్‌ రూ.1100 కోట్లు కూడా లేని పరిస్థితి ఉంటే, ఈరోజు రూ.3,600 కోట్లకు అందుతోంది. 
  • ప్రతి మండలానికి 108, రెండు 104 వాహనాలు ఉండేట్లుగా 1514 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం.
  • తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ కలుపుకుంటే 2,204 అంబులెన్స్‌ వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఇలా ఏ రాష్ట్రంలోనూ తిరగడం లేదు. 

53,126 మంది రిక్రూట్‌

  • రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మనం రిక్రూట్‌ చేసిన హెల్త్‌ డిపార్ట్‌ మెంట్‌స్టాఫ్‌ 53,126 మంది. 
  • నేషనల్‌ యావరేజ్‌ స్పెషలిస్ట్‌డాక్టర్లకు సంబంధించి 61 శాతం అవైలబుల్‌ ఉంటే, స్టేట్‌యావరేజ్‌ కేవలం 3.96 శాతం మాత్రమే. 
  • స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ పెట్టి, ప్రత్యేక బోర్డు పెట్టి వెంట పడుతున్నాం. 
  • జాతీయ స్థాయిలో నర్సుల పోస్టులు ప్రభుత్వాస్పత్రుల్లో వేకెన్సీ 27 శాతం. రాష్ట్ర యావరేజ్‌ జీరో. 
  • జాతీయ స్థాయిలో ల్యాబ్‌ టెక్నీషియన్ల వేకెన్సీలు గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో 33 శాతం. స్టేట్‌ యావరేజ్‌ జీరో. 
  • ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఇక్కడ నుంచి మంచి డాక్టర్లు రావాలి. 
  • మంచి పీజీ స్టూడెంట్లు రావాలి. మంచి మనసు రావాలి, మీరు కూడా పేదవాళ్లకు ఉపయోగపడే పరిస్థితి రావాలి. 

జగనన్న ఆరోగ్య సురక్ష

  • ఇప్పటి వరకు బటన్‌ నొక్కితే నేరుగా డీబీటీ పద్ధతిలో 2.35 లక్షల కోట్లు పేద ప్రజల ఖాతాల్లోకి నేరుగా లంచాలు, వివక్షకు చోటు లేకుండా చేయగలిగాం. 
  • ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ను ప్రతి గడపకూ తీసుకొని పోగలిగాం. 
  • ఇంటి తలుపుతట్టి రేషన్‌ కార్డు, రేషన్‌ బియ్యం, ప్రతి గడప ముంగిటకు చేర్చగలిగాం. 
  • ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ఇంటి స్థలం లేని వారు ఉన్నారా అని వెతికి, అప్లికేషన్‌పెట్టించి 30 లక్షల ఇంటి స్థలాలను పేదవాళ్లకు ఇవ్వగలిగాం. 
  • 22 లక్షల ఇళ్లు వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. 
  • ఎవరికి ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టి అవసరాలు తీరుస్తున్నాం. 
  • జగనన్న సురక్షలో 98 లక్షల సర్టిఫికెట్లు అందజేశాం. 
  • ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఇంకో మంచి కార్యక్రమం చేస్తున్నాం.
  • జగనన్న ఆరోగ్య సురక్ష అని ఈరోజు ప్రారంభించాం. 
  • ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడ పట్టి ఆ ఇంట్లో ఎవరికి ఏరకమైన సమస్య ఉన్నా 7 రకాల టెస్టులు, 5 దశల్లో యాక్టివిటీ మొదలు పెట్టాం. 
  • 4వ ఫేజ్‌ హెల్త్‌ క్యాంపు, సెప్టెంబర్‌ 30న మొదటి హెల్త్‌ క్యాంపు, తర్వాతి 45 రోజులు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ హెల్త్‌క్యాంపులు విస్తరించి పూర్తవుతాయి. 
  • గ్రామం మొత్తం మ్యాపింగ్‌ అవుతుంది. ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా వాళ్లకు ఫ్రీగా టెస్టులు చేస్తాం. మందులు ఇవ్వబోతున్నాం. 
  • తర్వాత హ్యాండ్‌ హోల్డింగ్‌ చేయబోతున్నాం. 
  • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా అడుగులు వేయబోతున్నాం. 
  • మీ అందరి సహాయ సహకారాలు రావాలి, కావాలి అని మనస్పూర్తిగా అడుగుతున్నా. 
  • కొన్ని మాటలు ఎప్పుడూ కూడా నా మనసుకు తడుతుంటాయి. 
  • నాట్‌ ఆల్‌ ఏంజిల్స్‌ హావ్‌ వింగ్స్‌. సమ్‌ హ్యావ్‌ స్టెతస్కోప్స్‌. కీప్‌ దిస్‌ ఇన్‌మైండ్‌.
  • ఇది ఇక్కడే రాసి సంతకం కూడా పెట్టా. 
  • ప్రజలకు మీరు చేయబోయే కార్యక్రమం, మంచి పోస్టు గ్రాడ్యుయేట్లు, మంచి డాక్టర్లుగా అవుతారు. ఆల్‌ ద వెరీ బెస్ట్‌.
Published date : 19 Sep 2023 12:43PM

Photo Stories