సెప్టెంబర్ 16న టీఎస్ సీపీజీఈటీ ఫలితాలు
Sakshi Education
టీఎస్ సీపీజీఈటీ–2022 ఫలితాలు సెప్టెంబర్ 16న విడుదల కానున్నాయి.
ఓయూతో పాటు ఇతర వర్సిటీలలో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, అయిదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 11 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షల మూల్యాంకనం చివరి దశలో ఉన్నట్లు కన్వినర్ ప్రొ.పాండురంగారెడ్డి వివరించారు.
Also read: BITS Pilani: ఆన్‌లైన్‌లో బిట్స్ పిలానీ బీఎస్సీ డిగ్రీ
ఓయూ నిర్వహించే CPGET– 2022లో 45 సబ్జెక్టులకు 67,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఓయూతో పాటు తెలంగాణ, తెలంగాణ మహిళ, కాకతీయ, పాలమూరు, శాతా వాహన, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సి టీల్లో పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సు ల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు.
Also read: CIPET: పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
పీజీ కౌన్సెలింగ్ సమయంలో 2022లో ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు.
Published date : 13 Sep 2022 05:40PM