Skip to main content

YVU: ఎల్‌ఎల్‌బీ, ఫైన్‌ ఆర్ట్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌ఎల్‌బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సు సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలతో పాటు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ పరీక్షా ఫలితాలు వైస్‌ చాన్సలర్‌ ఆచార్య చింతా సుధాకర్‌ న‌వంబ‌ర్ 8న‌ విడుదల చేశారు.
Yogivemana University Result Release - November 8, LLB Five-Year Course Semester Exam Results, Bachelor of Fine Arts Exam Results, LLB and Fine Arts Exam Result Released, LLB Three-Year Course Semester Exam Results,

వీసీ చాంబర్‌లో రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎన్‌.ఈశ్వరరెడ్డితో కలిసి పరీక్షా ఫలితాలపై చర్చించారు. సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షల ఫలితాలను త్వరితగతిన విడుదల చేయడం అభినందనీయమన్నారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 2వ సెమిస్టర్‌లో 339 మంది హాజరు కాగా 190 మంది (56.05 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు.

చదవండి: Lawyer to IPS Journey: న్యాయ‌వాది నుంచి ఐపీఎస్ గా విజ‌యం.. ఎలా..?

ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 6వ సెమిస్టర్‌ పరీక్షలకు 72 మంది హాజరు కాగా 40 మంది (55.56 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. 8వ సెమిస్టర్‌లో 111 మంది హాజరు కాగా 78 మంది (70.27 శాతం) పాసయ్యా రని వివరించారు. 10వ సెమిస్టర్‌లో 126 మంది వి ద్యార్థులు పరీక్షలు రాయగా 106 మంది (84.13 శా తం) ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ 2,4,6 సెమిస్టర్లలో 100 శాతం ఉత్తీర్ణత సా ధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ సహాయ అధికారి డా.సుమిత్ర పాల్గొన్నారు.

Published date : 09 Nov 2023 12:05PM

Photo Stories