Skip to main content

Medical college: 2024 విద్యాసంవత్సరం వంద సీట్లతో తరగతులు ప్రారంభం

● అనుమతులు మంజూరు చేసిన జాతీయ వైద్య కమిషన్‌ ● అంకుసాపూర్‌ వద్ద చురుకుగా సాగుతున్న నిర్మాణ పనులు ● నెరవేరనున్న జిల్లా వాసుల కల
medical students
medical students

నెరవేరనున్న కల

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జిల్లా వాసులు చిరకాల కల వైద్యకళాశాల ఏర్పాటుతో సాకారమైంది. జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలతోపాటు ప్రభుత్వ డిగ్రీ కళాశా ల ఏర్పాటు చేయాలని స్థానికులు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం వైద్య కళాశాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 15 మండలాల విద్యార్థులు వైద్య విద్య కోసం హైదరాబాద్‌, వరంగల్‌తో పాటు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. కళా శాల ఏర్పాటుతో ఉన్నత విద్య గిరిజనులకు అందుబాటులోకి రానుంది.

ఆసిఫాబాద్‌: జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటుకు జాతీయ వైద్యకమిషన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. జిల్లాలో విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో కి రావడంతోపాటు వైద్యసేవలు మెరుగుపడనున్నా యి. ఇప్పటికే భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, ఈ నెల 9న జాతీయ వైద్య కమిషన్‌ నుంచి అనుమతులు కూడా మంజూరయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Also read: March 2023 Top 30 Current Affairs Bits in Telugu | APPSC | TSPSC | Police | UPSC


మొదట జిల్లా ఆసుపత్రి..

ఆసిఫాబాద్‌ మండలం అంకుసాపూర్‌ శివారులో నే షనల్‌ హెల్త్‌మిషన్‌ కింద రూ.60 కోట్లతో మంజూరై న 340 పడకల జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి గతేడా ది మార్చి 4న రాష్ట్ర వైద్యారోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. పనులు కూడా ప్రా రంభమయ్యాయి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తొ మ్మిది జిల్లాలకు వైద్యకళాశాలలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని వైద్యకళాశాలకు అనుగుణంగా మార్పు చేశారు. రూ.28 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాలలో అదనంగా ఎనిమిది బ్లాకులు ఉండనున్నాయి. వి ద్యార్థులు చదువుకునేందుకు వీలుగా గదుల నిర్మా ణం చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి భవనంపై రెండో అంతస్తులో జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం 50 పడకల స్థాయిగా ఉన్న ఈ ఆసుపత్రి 330 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తారు. మెడికో విద్యార్థుల కు స్థానిక ఆసుపత్రుల్లో ప్రాక్టికల్‌ శిక్షణ ఇవ్వనున్నా రు. జాతీయ వైద్యకమిషన్‌ నుంచి అనుమతులు రా వడంతో నిర్మాణ పనులు వేగవంతం చేశారు. కలెక్ట ర్‌ హేమంత్‌ బోర్కడే కళాశాల ప్రిన్సిపాల్‌ నాగార్జున చారితో కలసి ఇప్పటికే పలుమార్లు పనులను పరిశీలించారు. జూన్‌లోగా పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్‌ కోర్సును ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Also read: Top 10 Current Affairs in Telugu: ఏప్రిల్ 11, టాప్ - 10 క‌రెంట్ అఫైర్స్


100 సీట్లతో ప్రారంభం

2023– 24 విద్యాసంవత్సరంలో జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో 100 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇప్పటికే ఎన్‌ఎంసీ బృందం జిల్లాలో సర్వే నిర్వహించింది. ఏటా కొత్తగా 100 సీట్లను పెంచుతారు. విద్యార్థులతోపాటు కళాశాలకు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నిర్వహణ, బోధన సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నారు. విద్యాబోధన కోసం ప్రొఫెసర్లు, ప్రత్యేక వైద్యనిపుణులతో పాటు వైద్యసిబ్బందిని నియమించనున్నారు. వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితోపాటు మరో రెండు పీహెచ్‌సీలను అనుసంధానం చేస్తారని అధికారులు వెల్లడించారు.

Also read: ‘పది’ మూల్యాంకనం నుంచి మినహాయించండి


మెరుగైన వైద్యం..

జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నిత్యం చంద్రాపూర్‌, మంచిర్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేట్‌ వైద్యానికి భారీగా వెచ్చించి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ తరుణంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటైతే అత్యవసర పరిస్థితుల్లోనూ ఇన్‌పేషెంట్‌ చికిత్స అందుతుంది. వైద్యనిపుణులు అందుబాటులోకి వస్తే ఖరీదైన శస్త్ర చికిత్సలు ఇక్కడే చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

Published date : 13 Apr 2023 07:57PM

Photo Stories