‘పది’ మూల్యాంకనం నుంచి మినహాయించండి
Sakshi Education
కరీంనగర్: పదోతరగతి మూల్యాంకన విధుల నుంచి మెడికల్ గ్రౌండ్ కలిగిన ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని పీఆర్‌టీయూ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం డీఈవో జనార్ధన్‌రావుకు వినతిపత్రం అందించారు.
సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముస్కు తిరుపతిరెడ్డి, మర్రి జైపాల్‌రెడ్డిలు మాట్లాడుతూ.. కరీంనగర్‌లోని సెయింట్ జాన్ స్కూల్‌లో జరిగే పదోతరగతి మూల్యంకన విధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధులు కేన్సర్, బ్యాక్ పెయిన్, హార్ట్‌సర్జరీ, 60 ఏళ్ల వయసు పైబడిన వారికి మినహాయింపునివ్వాలని విన్నవించారు. స్పాట్ వాల్యుయేషన్ విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల టీచర్లను అనుమతించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్‌రావు, అన్నాడి మోహన్‌రెడ్డి, మందల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Published date : 13 Apr 2023 07:04PM