Medical Education: ఏప్రిల్ 18 నుంచి సూపర్ స్పెషాలిటీ తరగతులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: 2021 వైద్య విద్య సంవత్సరంలో సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఈ నెల 18 నుంచి మొదటి ఏడాది తరగతులు ప్రారంభించాలని జాతీయ వైద్య కమిషన్ నిర్ణయించింది. కోవిడ్ ఉధృతి దృష్ట్యా గత ఏడాది ప్రారంభం కావలసిన సూపర్ స్పెషాలిటీ మొదటి ఏడాది తరగతులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో తరగతులను ప్రారంభించడంతో పాటు.. ఈ బ్యాచ్ విద్యార్థులకు 2025 మార్చి 31 నాటికి తుది సంవత్సరం తరగతులను కూడా ముగించాలని ఆదేశించింది.
Also read: NO Interview: గ్రూప్–1తో సహా అన్ని నియామకాలకు రాతపరీక్షలే
Published date : 14 Apr 2022 03:40PM