NO Interview: గ్రూప్–1తో సహా అన్ని నియామకాలకు రాతపరీక్షలే
గ్రూప్–1తో సహా ఇతర అన్ని పోస్టులను కేవలం రాత పరీక్షల ఆధారంగానే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో 47 జారీచేశారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 11వ తేదీనే రూపొందించినట్లు అందులో ఉంది. అయితే కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం తర్వాత ఆ ఉత్తర్వులు వెలువరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్న క్రమంలో భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నియామకాలు పారదర్శకతతో నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టీఎస్‌పీఎస్సీతో సహా ఇతర నియామక ఏజెన్సీలన్నీ ఇదే విధానాన్ని అనుసరించాలని ఆదేశించింది.
చదవండి:
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
పోటీ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
టీఎస్‌పీఎస్సీ సిలబస్
టీఎస్‌పీఎస్సీ ప్రివియస్ పేపర్స్
టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ టెస్ట్స్