Skip to main content

Jobs: వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

గజ్వేల్‌రూరల్‌: ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వివిధ వైద్య పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సాయికిరణ్‌ తెలిపారు.
ApplyToday,Jobs, Government Hospital Gajvel, Healthcare professionals ,MedicalJobs
వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సెప్టెంబ‌ర్ 4న‌ ఆయన విలేకరులతో మాట్లాడుతూ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌(9), పీడియాట్రిక్‌(2), గైనకాలజీ(2), అనెస్థిషియా(3), జనరల్‌ ఫిజీషియన్‌(2) విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో వైద్య పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబ‌ర్ 6 నుంచి 20వ తేదీలోగా గజ్వేల్‌లోని ప్రభుత్వాస్పత్రిలోని కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. నియామకాలు డిస్ట్రిక్ట్‌ సెలెక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని పేర్కొన్నారు.

చదవండి:

University Jobs: యునివ‌ర్సిటీల్లో ఉద్యోగాల‌కు భ‌ర్తీలు

SERP Salaries: జీతాలు పెంచేందుకు జీవో విడుద‌ల‌

Published date : 05 Sep 2023 03:29PM

Photo Stories