Skip to main content

Man Cheats People: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పేరుతో.. 400 మందిని మోసం చేసిన యువకుడు

వైఎస్సార్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కల్పిస్తామని సుమారు రూ. 10 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంఘటన పీలేరులో ఆలస్యంగా వెలుగు చూసింది.
Trap for the unemployed to earn money    young man cheated 400 people in the name of software job  Pileru software job scam

మార్చి 17న‌ పలువురు బాధితులు పీలేరు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వెళ్లి ఎస్‌ఐ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన రెడ్డిసూర్యప్రసాద్‌ అలియాస్‌ భరత్‌ అనే యువకుడు హైదరాబాద్‌లో ఉంటూ అడ్డదారిలో సంపాదించడానికి నిరుద్యోగులకు వల వేశాడు.

ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 400 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేశాడు. రెండు నెలల పాటు వేతనాలు సక్రమంగా చెల్లించి నమ్మించాడు.

చదవండి: TSPSC AEE jobs: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీలో కీలక ముందడుగు

అనంతరం మొహం చాటేశాడు. దీంతో మోసపోయిన కొంత మంది యువకులు తాము డబ్బులు చెల్లించిన బ్యాంకు అకౌంట్‌ చిరునామాను గుర్తించారు.

హైదరాబాద్, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూ రు, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి సుమారు 400 మంది నిరుద్యోగులు మోసపోయినట్లు తెలుసుకున్నారు. పలువురు బాధితులు తమకు న్యాయం చేయాలని పీలేరు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు.

Published date : 19 Mar 2024 10:29AM

Photo Stories