Skip to main content

విప్రో చైర్మన్‌ కీలక నిర్ణయం, సగం జీతం కట్‌

సాక్షి, ముంబై: విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది తన వేతనాన్ని సగానికి తగ్గించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున లేఆఫ్స్‌కు మొగ్గు చూపుతున్నతరుణంలో విప్రో రిషద్ ప్రేమ్‌జీ వేతన కోత నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విప్రో చైర్మన్‌ కీలక నిర్ణయం, సగం జీతం కట్‌

యుఎస్‌లోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు ఇటీవల దాఖలు చేసిన సమాచారం ప్రకారం రిషద్ ప్రేమ్‌జీ 2023 ఆర్థిక సంవత్సరానికి తన జీతంలో స్వచ్ఛందంగా 50 శాతం కోత  విధించుకున్నారు.

మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి మొత్తం వార్షిక పరిహారంగా 951,353 డాలర్లు పొందగా , మునుపటి సంవత్సరం ఆదాయంతో పోలిస్తే దాదాపు 50 శాతం తక్కువ. విప్రో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా  ప్రేమ్‌జీ ప్రస్తుత 5 సంవత్సరాల పదవీకాలం జూలై 30, 2024న ముగియనుంది. 
 

Published date : 26 May 2023 04:40PM

Photo Stories