Mega Job Mela: ఉద్యోగ, ఉపాధి కల్పనలో అగ్రస్థానం
మండలంలోని వెలికట్ట గ్రామ శివారు రామ ఉపేందర్ గార్డెన్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఈజీఎంఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25న మెగా జాబ్‌మేళా నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 82 కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాయి.
5,651మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా 2,341 మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించారు. ఉద్యోగాలు పొందిన వారిని మంత్రి అభినందించి నియామక పత్రాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ..మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు చదివించారని, చదువుకు తగ్గ ఉద్యోగం లభించినప్పుడు గౌరవం, తృప్తి కలుగుతుందని అన్నారు. నిరుద్యోగ యువత వద్దకే వచ్చి ప్రముఖ సంస్థలు, కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించడం గర్వకారణమని తెలిపారు.
చదవండి: Mini Job Mela: నిరుద్యోగులకు ఉద్యోగావకాశం.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్‌డీఓ సన్యాసయ్య, ఎస్పీ చంద్రమోహన్, ఎంపీపీలు తూర్పాటి చిన్న అంజయ్య, ఈదురు రాజేశ్వరి, జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీలు మంగళపల్లి శ్రీనివాస్, శ్రీరాం జ్యోతిర్మయి, రంగు కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ లింగాల వెంకటనారాయణగౌడ్, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, అడిషనల్ డీఆర్‌డీఓ సట్ల వెంకట్, ఆర్డీఓ నర్సింగరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.