Skip to main content

Mini Job Mela: నిరుద్యోగుల‌కు ఉద్యోగావ‌కాశం.

యువ‌త కోసం మినీ జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌. ఈ ప్ర‌క‌ట‌న‌లో భాగంగా ఇంట‌ర్య్వూ వివ‌రాల‌ను స్పష్టించారు. ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. వివ‌రాలు..
Mini job mela at youth coaching center
Mini job mela at youth coaching center

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ సీడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 29న రంపచోడవరం యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో టైర్స్‌, డిమార్ట్‌ రెండు కంపెనీల్లో ఉద్యోగాల ఎంపిక కోసం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఎంపికలు నిర్వహిస్తామన్నారు.

TS TET Results Link 2023 : రేపే టీఎస్ టెట్‌-2023 ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ కోసం..

జిల్లాలోని 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు గల టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఆపై చదువులు పూర్తిచేసిన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అభ్యర్థులు పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు, ధ్రువపత్రాల జెరాక్స్‌ కాపీలతో హాజరుకావాలని ఆయన కోరారు. ఎంపికై న వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకూ వేతనం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 6304634447లో సంప్రదించాలని ఆయన కోరారు.

Published date : 26 Sep 2023 02:02PM

Photo Stories