Skip to main content

Salary Hike: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్..

2024లో భారతీయ ఉద్యోగుల జీతాలు పెరగనున్నట్లు 'డబ్ల్యుటీడబ్ల్యు శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్' (WTW Salary Budget Planning Report) వెల్లడించింది.
Salaries will increase by in these fields next year

వచ్చే ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధికంగా జీతాల పెంపు భారతదేశంలోనే జరగబోతోందని కూడా నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ ఉద్యోగుల జీతం 2024లో 9.8 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2024లో భారతీయ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. భారతీయ సంస్థలు టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో, ఉద్యోగుల ప్రతిభకు తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది, తద్వారా జీతాల పెరుగుదల జరుగుతుంది.

చదవండి: High Salary Jobs : రూ.6.5 కోట్ల జీతం వ‌చ్చే ఉద్యోగాన్ని వ‌దిలేశాడు.. కార‌ణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

2024లో ఉద్యోగుల జీతం వియత్నాంలో 8%, చైనా 6%, ఫిలిప్పీన్స్ 5.7%, థాయిలాండ్ 5% వరకు పెరగనుంది. ఈ దేశాలతో పోల్చితే భారత్ (9.8%) ముందు వరుసలో ఉన్నట్లు స్పష్టమవుతుంది.

Salary Hike

రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (61%), ఇంజనీరింగ్ (59.8%), సేల్స్ (42.9%), టెక్నికల్ స్కిల్స్ ట్రేడ్ (38.6%), ఫైనాన్స్ (11.8%) ), మార్కెటింగ్ (10.6%), హ్యూమన్ రీసోర్స్ (3.1%) విభాగాల్లో ఉద్యోగాలు, జీతాలు పెరగనున్నాయి. అంతే కాకుండా టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ రంగాల్లో కూడా జీతాలు పెరుగుదల ఉంటుంది.
 

Published date : 02 Nov 2023 12:39PM

Photo Stories