Skip to main content

Employees DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు శుభ‌వార్త‌.. 4 శాతం డీఏ పెంపు

మార్చి 7వ తేదీ జ‌రిగిన‌ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Cabinet Approves 4% Dearness Allowance Hike for Central Govt Employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), పెన్షనర్లకు కరువు సహాయాన్ని (డీఆర్‌) బేసిక్‌ పే/పెన్షన్‌పై మరో 4 శాతం పెంచారు. ప్రస్తుతం 46 శాతంగా ఉన్న డీఏ/డీఆర్‌ తాజా పెంపుతో 50 శాతానికి చేరింది. ఈ పెంచిన భత్యం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుంది. దీనివల్ల కోటి మందికిపైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ప్ర‌స్తుతం ధరలు పెరగడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను పెంచినట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ అన్నారు. ఈ పెంపు వల్ల ఖజానాపై ప్రతి సంవ‌త్స‌రం రూ.12,869 కోట్ల భారం పడుతుందని తెలిపారు.

కీలక అంశాలు..

  • డీఏ/డీఆర్‌ 4 శాతం పెంపు (46% నుండి 50% కి)
  • అమలు తేదీ: 2024 జనవరి 1
  • లబ్ధిదారులు: కోటి మందికిపైగా ఉద్యోగులు, పెన్షనర్లు
  • ఖజానాపై భారం:
    • ఏటా: రూ.12,869 కోట్లు
    • 2024 జనవరి నుండి 2025 ఫిబ్రవరి వరకు: రూ.15,014 కోట్లు
  • డీఏ పెంపుతో ఇతర భత్యాలు, గ్రాట్యుటీ కూడా పెరుగుతాయి.
  • డీఏ/డీఆర్‌ పెంపు ఏడో కేంద్ర వేతన కమిషన్‌ సిఫార్సుల ప్రకారం.

AI Mission: కేంద్రం కీలక నిర్ణయం.. ఏఐ కోసం రూ.వేల కోట్లు!!

Published date : 08 Mar 2024 05:48PM

Photo Stories