Skip to main content

Indians Got American Citizenship: అమెరికా పౌరసత్వాల్లో భారత్‌ రికార్డ్!!

2022లో అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య 65,960 మందికి చేరుకుని రికార్డు సృష్టించింది.
Nearly 66,000 Indians Got American Citizenship In 2022

తాజా కాంగ్రెషనల్ నివేదిక ప్రకారం.. అమెరికాలో కొత్తగా పౌరసత్వాలు పొందినవారిలో మెక్సికో తర్వాత భారత్‌ రెండవ అతిపెద్ద మూలాధార దేశంగా ఉంది.

యూఎస్‌ సెన్సెస్ బ్యూరోకు చెందిన అమెరికన్ కమ్యూనిటీ సర్వే డేటా ప్రకారం, 2022లో 4.6 కోట్ల మంది విదేశాల్లో జన్మించిన పౌరులు యునైటెడ్ స్టేట్స్‌లో నివసించినట్లు అంచనా. ఇది మొత్తం యూఎస్‌ జనాభా 33.3 కోట్లలో దాదాపు 14 శాతం. వీరిలో 2.45 మిలియన్ల మంది అంటే దాదాపు 53 శాతం మంది సహజ పౌరులుగా తమ స్థితిని నివేదించారు.

ఇండిపెండెంట్‌ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ఏప్రిల్ 15 నాటి తాజా “యూఎస్‌ నేచురలైజేషన్ పాలసీ” నివేదిక ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో 9,69,380 మంది సహజసిద్ధమైన యూఎస్‌ పౌరులుగా మారారు. “మెక్సికోలో జన్మించిన వారు అత్యధిక సంఖ్యలో సహజీకరణలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత్‌, ఫిలిప్పీన్స్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్ నుంచి వచ్చిన వ్యక్తులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు” అని నివేదిక పేర్కొంది.

visitors Record: రికార్డ్‌.. ఈ దేశానికి ఒక్క నెలలో పెరిగిన‌ పర్యాటకుల తాకిడి..!

అందుబాటులో ఉన్న తాజా డేటా ఆధారంగా, 2022లో 128,878 మంది మెక్సికన్ పౌరులు అమెరికన్ పౌరులుగా మారారని సీఆర్‌ఎస్‌ తెలిపింది. వారి తర్వాతి స్థానాల్లో భారతీయులు (65,960), ఫిలిప్పీన్స్ (53,413), క్యూబా (46,913), డొమినికన్ రిపబ్లిక్ (34,525), వియత్నాం (33,246), చైనా (27.038) ఉన్నారు. సీఆర్‌ఎస్‌ ప్రకారం 2023 నాటికి, 28,31,330 మంది విదేశీ అమెరికన్లు భారత్‌కు చెందినవారు. ఇది మెక్సికో 1,06,38,429 తర్వాత రెండవ అతిపెద్ద సంఖ్య. తరువాత స్థానంలో చైనాకు చెందిన విదేశీ అమెరికన్లు 22,25,447 మంది ఉన్నారు.

H5N1 Bird Flu: తొలిసారి ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ వైరస్.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

Published date : 22 Apr 2024 12:54PM

Photo Stories