H5N1 Bird Flu: తొలిసారి ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ వైరస్.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
ఈ వైరస్ పచ్చి పాలలో మాత్రమే ఉంటుందని, పాలను వేడి చేసినప్పుడు నాశనమవుతుందని నిపుణులు చెబుతున్నప్పటికీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
కీలక అంశాలు..
➢ న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ఈ వైరస్ ప్రభావితం చేసింది.
➢ టెక్సాస్, కాన్సాస్, మిచిగాన్, న్యూ మెక్సికో, ఇడాహో, ఒహియో, నార్త్ కరోలినా, సౌత్ డకోటాలో ఈ వైరస్ సోకిన ఆవులను గుర్తించారు.
➢ టెక్సాస్‌లో ఈ వైరస్‌ను మొదటగా గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ఇన్‌ఫ్లుఎంజా ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ వెన్కింగ్ జాంగ్ తెలిపారు.
➢ పక్షుల నుండి ఆవుకు, ఆ ఆవు ద్వారా ఇతర ఆవులకు ఈ వైరస్ సోకినట్లు భావిస్తున్నారు.
H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్‌ఫ్లూ ముప్పు.. సైంటిస్టుల హెచ్చరిక!!
➢ 2020 నుంచి బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అడవి పక్షులు, పౌల్ట్రీలు మరణించాయి.
➢ బర్డ్ ఫ్లూ కారక హెచ్5ఎన్1 వైరస్‌ను 1996లో ప్రారంభంలో తొలిసారిగా గుర్తించారు ఆ తరువాత వేగంగా విస్తరించింది.
➢ ఈ వైరస్ మానవులు, పిల్లులు, ఎలుగుబంట్లు, నక్కలు, మింక్, పెంగ్విన్‌లతో సహా వివిధ క్షీరదాలకు కూడా సోకింది.
➢ గత నెలలో.. ఆవులు, మేకలు కూడా ఈ జాబితాలో చేరడం నిపుణులను ఆశ్చర్యపరిచింది.