కాంట్రాక్టు సూపర్‌వైజర్ల క్రమబద్ధీకరణ
Sakshi Education
Telangana State Department of Women Development and Child Welfare పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు సూపర్‌వైజర్ల సర్వీసును అతిత్వరలో క్రమబద్ధీకరిం చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ముఖ్య మంత్రి KCR ఇచ్చిన హామీలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే చర్యలను ప్రభుత్వ శాఖలు వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు, ప్రస్తుత పరిస్థితి, రోస్టర్, రిజర్వేషన్లవారీగా ఖాళీలు, కొన సాగుతున్న ఉద్యోగులకు సంబంధించిన ప్రతిపాద నలను సిద్ధం చేశాయి. ముందుగా రాష్ట్ర మహిళాభి వృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వానికి ఈ ప్రతిపాద నలు సమర్పించడంతో ఆ శాఖలోని కాంట్రాక్టు సూపర్‌వైజర్లకే తొలి ఆమోదం దక్కనున్నట్లు సమా చారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయానికి చేరినట్లు సమాచారం. ప్రస్తుతం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో 144 మంది కాంట్రాక్టు సూపర్‌వైజర్లు ఉన్నారు.
Published date : 10 Jun 2022 04:07PM